బాక్సాఫీస్ దగ్గర అప్పుడప్పుడూ కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అద్భుతమే.. ది కశ్మీర్ ఫైల్స్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ అంత గొప్ప ట్రాక్ రికార్డేమీ లేని వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రమిది. ఇందులో ఏమీ స్టార్లు లేరు. ఇదేమీ భారీ బడ్జెట్ సినిమా కాదు. ఒక ఊహాజనిత గాథతో తీసిన సినిమా కూడా కాదు. అసలిప్పటి నేపథ్యంలో నడిచే కథా కాదు.
కశ్మీర్లో 90వ దశకంలో హిందూ పండిట్ల మీద జరిగిన అఘాయిత్యాల నేపథ్యంలో వివేక్ ఈ సినిమాను రూపొందించాడు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గత వారం పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది.
తొలి రోజు మూడు కోట్లకు అటు ఇటుగా వసూళ్లే సాధించిందీ సినిమా. అలాంటి చిత్రం.. వారాంతం అయ్యాక, వీక్ డేస్‌లో రోజుకు ఏడెనిమిది కోట్లకు తగ్గకుండా గ్రాస్ రాబడుతూ ఔరా అనిపిస్తోంది. స్క్రీన్లు పెరుగుతున్నాయి. షోలు పెరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
ఉత్తరాదిన ఈ సినిమా ఇలా పుంజుకోవడంలో మరీ ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. కానీ దక్షిణాదిన హిందీ సినిమాాలు తక్కువగా చూసే ప్రాంతాల్లో కూడా ‘కశ్మీర్ ఫైల్స్’ వసూళ్ల మోత మోగిస్తోంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో అడ్వాన్స్ ఫుల్స్ పడుతున్నాయి. గత వారం భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ను వీకెండ్లోనే ఉత్తరాదిన ‘కశ్మీర్ ఫైల్స్’తో రీప్లేస్ చేశారు. ఇప్పుడు దేశమంతటా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సైతం ‘రాధేశ్యామ్’ను తీసేసి ‘కశ్మీర్ ఫైల్స్’ను ఆడించే పరిస్థితి కనిపిస్తోంది. ఏముందీ సినిమాలో అని ప్రేక్షకులు ఎగబడి ఎగబడి చూస్తున్నారు. చిత్ర బృందం పెద్దగా పబ్లిసిటీ ఏమీ చేయకున్నా.. జనాలే అమితాసక్తితో సినిమా చూస్తున్నారు. హిందువుల మీద జరిగిన అఘాయిత్యాలపై తీసిన సినిమా కావడంతో బీజేపీ వాళ్లు దీన్ని ఓన్ చేసుకుని, తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటుండటం, పబ్లిసిటీ ఇస్తుండటం కూడా వాస్తవమే అయినప్పటికీ.. సామాన్య జనం ఈ సినిమాపై ఇంత ఆసక్తిని ప్రదర్శించడం మాత్రం విశేషమే. వారం వ్యవధిలో రూ.90 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన ‘కశ్మీర్ ఫైల్స్’ ఫుల్ రన్లో రూ.200 కోట్ల మార్కును అందుకునేలా ఉంది.
This post was last modified on March 18, 2022 4:50 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…