Movie News

ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు దాని మీదే

మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ‘రాధేశ్యామ్’ పనైపోతున్నట్లే కనిపిస్తోంది. వీక్ డేస్‌లో ఈ సినిమా బాగా వీక్ అయింది. ఈ వారం ‘స్టాండప్ రాహుల్’ మినహా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. ఆ సినిమాకు కూడా పెద్దగా హైప్ లేదు. కాబట్టి వీకెండ్లో ‘రాధేశ్యామ్’ ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టే అవకాశముంది. అయినా సరే.. ఆ వసూళ్లు బయ్యర్లను సేఫ్ జోన్లోకి తీసుకొచ్చే పరిస్థితి ఎంతమాత్రం లేదు.

నష్టాలు కొంత మేర తగ్గుతాయి తప్ప బయ్యర్లు బయటపడే ఛాన్సే లేదు. యువి క్రియేషన్స్ వాళ్లు బయ్యర్లకు ఎంతో కొంత సెటిల్ చేయకపోతే కష్టమే. తెలుగు రాష్ట్రాల వరకు పరిస్థితి ఎంతో నయం. అవతలంతా ఈ సినిమా వాషౌట్ అనే చెప్పాలి. తొలి వీకెండ్ తర్వాత సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మీద ఎన్నో అంచనాలు పెట్టుకుంటే.. రెండేళ్ల ముందు సాహో, ఇప్పుడు రాధేశ్యామ్ అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ‘సాహో’ అయినా యాక్షన్ ప్రియులను ఓ మోస్తరుగా మెప్పించింది.

కానీ ‘రాధేశ్యామ్’ అదీ లేదు. ఈ సినిమాను మెచ్చిన వాళ్ల శాతం చాలా తక్కువ. ఈ రెండు చిత్రాల సంగతెలా ఉన్నా.. ప్రభాస్ చేతిలో ఉన్న కొత్త సినిమాల రేంజే వేరుగా కనిపిస్తోంది. ఆదిపురుష్, సలార్,ప్రాజెక్ట్ కే, స్పిరిట్.. ఇలా క్రేజీ కాంబినేషన్లలో వందల కోట్ల బడ్జెట్లలో అతడి సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ వీటిలో అన్నీ ప్రామిసింగ్ అనే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఇంకో ఏడాది లోపే ప్రేక్షకులను పలకరించనున్న ‘ఆదిపురుష్’ మీద ప్రభాస్ అభిమానులకు అనేక సందేహాలున్నాయి. అది రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఎన్నో సార్లు చూసిన ఈ కథ కొత్తగా ఎగ్జైట్ చేసేదేముంది? సాంకేతిక హంగులతో విజువల్‌గా గొప్పగా చూపించడం తప్ప కథాకథనాలతో ఆశ్చర్యపరిచేదేమీ ఉండదని, ప్రభాస్ నుంచి అభిమానులు ఆశించే సినిమా ఇది కాదని అంటున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందన్న అంచనాలైతే లేవు. ఇక ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు పూర్తయి రిలీజ్ కావడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. మధ్యలో మారుతి సినిమా అంటున్నారు కానీ.. ప్రభాస్ ఇమేజ్‌ను మ్యాచ్ చేసే సినిమాను ఆ దర్శకుడు తీయగలడా అన్నది డౌటే. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’ మీదే ఉన్నాయి. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ను డీల్ చేయడానికి సరైన దర్శకుడని, అతడి మార్కు యాక్షన్, ఎలివేషన్లు ఉంటే ‘సలార్’ రేంజే వేరుగా ఉంటుందని, ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే సినిమా ఇదే అవుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మరి వచ్చే ఏడాది వేసవిలో లేదా ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశమున్న ఈ సినిమానే ప్రభాస్ అభిమానుల దాహం తీరుస్తుందని ఆశించవచ్చు.

This post was last modified on March 18, 2022 11:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

53 minutes ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

2 hours ago

టీడీపీపై తెలంగాణకు ఆశ చావలేదు!

అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…

3 hours ago

వైసీపీలో ఉక్కపోత ఈ రేంజిలో ఉందా?

ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…

4 hours ago

శంక‌ర్ ఆట‌లు ఇక సాగ‌వు

శంక‌ర్.. ఒక‌ప్పుడు ఈ పేరు చూసి కోట్ల‌మంది క‌ళ్లు మూసుకుని థియేట‌ర్ల‌కు వెళ్లిపోయేవారు. హీరోలు క‌థ విన‌కుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…

5 hours ago

దిల్ రాజు కోసం చరణ్ మరో సినిమా ?

యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…

13 hours ago