యంగ్ రెబల్ స్టార్ కొత్త సినిమా అప్ డేట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నెలలో కచ్చితంగా అప్ డేట్ ఉంటుందని ఆ చిత్ర పీఆర్ వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. నిజానికి జూన్ 14నే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పోస్టర్ రిలీజ్ చేయాల్సిందట.
ఐతే బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో అందరూ విషాదంలో మునిగిపోయిన నేపథ్యంలో ఈ పాన్ ఇండియా మూవీ అప్ డేట్ ఇవ్వలేకపోయారు. కొంచెం గ్యాప్ తీసుకుని.. మరి కొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ లాంచ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐతే ఈ లోపే బాలీవుడ్ మీడియాకు చిత్ర బృందం నుంచి కొంత సమాచారం వెళ్లింది. ఫస్ట్ లుక్ లాంచ్ ముంగిట హైప్ కోసమే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ పీఆర్వోలు వరుసబెట్టి ప్రభాస్ కొత్త సినిమా గురించి ట్వీట్లు వేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలోనే ఫస్ట్ లుక్ వాయిదా పడిందని అంటున్నారు. అంతే కాదు.. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారైనట్లుగా వాళ్లు ట్వీట్లు వేస్తున్నారు. ఆ ట్వీట్లన్నీ ఒకే రకంగా ఉండటంతో చిత్ర బృందమే అక్కడి పీఆర్వోలకు హింట్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
ఇంతకుముందు ‘జాన్’ అనే ఓ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ.. దాని విషయంలో వెనక్కి తగ్గినట్లున్నారు. ఇప్పుడొస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ ప్రేమకథకు ఈ టైటిల్ ఖరారైనట్లే అనిపిస్తోంది. కచ్చితంగా ఇంకో వారం లోపు ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ఇంకో 20 శాతం దాకా చిత్రీకరణ మిగిలున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.
This post was last modified on June 20, 2020 12:12 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…