చైతన్య జొన్నలగడ్డ.. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారిన పేరు. సోషల్ మీడియాలో కూడా తెలుగు నెటిజన్లు ఇతడి గురించే చర్చించుకుంటున్నారు. అతడి గురించి తెగ వెతికేస్తున్నారు. మెగా ఫ్యామిలీ అమ్మాయి, నాగబాబు తనయురాలు నిహారిక కొణిదెల పెళ్లాడబోతున్న కుర్రాడు ఇతనే. కొన్ని నెలల కిందటే నిహారికకు పెళ్లి చేయబోతున్నట్లు సంకేతాలిచ్చిన నాగబాబు.. అన్నట్లుగానే ఆమె పెళ్లి ఫిక్స్ చేసేశారు.
మొన్న ‘మిస్ నుంచి మిసెస్’ కాబోతున్నట్లు హింట్ ఇచ్చిన నిహారిక.. నిన్న ముఖం కనిపించకుండా తన ఫియాన్సీని కౌగిలించుకున్న ఫొటో పెట్టింది. రాత్రికి నిహారికకు కాబోయే వరుడి ఫొటోతో పాటు వివరాలన్నీ బయటికి వచ్చేశాయి. ఆ అబ్బాయి పేరు చైతన్య జొన్నలగడ్డ అని.. అతడిది గుంటూరని.. తండ్రి పెద్ద పోలీసాఫీసర్ అని.. చైతన్య ఓ స్ట్రీట్ ఫొటోగ్రాఫర్ అని.. అతడికి కొత్త తరహా వాచ్‌ల కలెక్షన్ హాబీ అని.. ఇలా అన్ని వివరాలూ బయటికి వచ్చేశాయి.
అంతటితో ఆగకుండా చైతన్య గురించి మరింత సమాచారం రాబట్టేందుకు సోషల్ మీడియాలో అతడిని తెగ ఫాలో అయిపోతున్నారు నెటిజన్లు. మొన్నటి వరకు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఉన్న కేవలం 1700 మంది. కానీ నిన్న నిహారిక ఫియాన్సీ అని తెలిశాక కొన్ని గంటల్లోనే ఫాలోవర్లు పెరిగిపోయారు. ఇప్పుడు 35 వేల మంది దాకా అతణ్ని అనుసరిస్తున్నారు. మరోవైపు గూగుల్లోకి వెళ్లి చైతన్య అని కొట్టగానే జొన్నలగడ్డ అనే అతడి ఇంటిపేరుతో సహా ముందే పేరు వచ్చేస్తోంది.
అతడి గురించి రకరకాల వార్తలు, ఇతర సమాచారం కనిపిస్తున్నాయి. సెలబ్రెటీ అమ్మాయిని పెళ్లాడితే ఎంత పాపులారిటీ వస్తుందనడానికి ఇది ఉదాహరణ. ఇదిలా ఉండగా చిరంజీవి కూతురు శ్రీజను పెళ్లాడిన కళ్యాణ్ దేవ్ హీరోగా మారిన నేపథ్యంలో.. మంచి లుక్స్‌తో ఉన్న చైతన్య కూడా తెరంగేట్రం చేస్తాడేమో అంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైపోవడం గమనార్హం.
This post was last modified on June 19, 2020 11:31 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…