ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలను కేవలం తెలుగు హీరోల్లా చూసే పరిస్థితి లేదు. ఒక్కొక్కరుగా తమ మార్కెట్‌ను విస్తరిస్తూ పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ దేశవ్యాప్తంగా తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్ సైతం పాన్ ఇండియా లెవెల్లో తాన ఫాలోయింగ్, మార్కెట్‌ను విస్తరించాడు. పుష్ప సినిమా అతడికి ఎక్కడలేని గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల ఇమేజ్‌లు కూడా మారిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే.. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను విస్తరించడంలో చాలా ప్రణాళికలతో అడుగులు వేసే అల్లు అర్జున్.. పుష్పతో వచ్చిన గుర్తింపును మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంటాడనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే అతను ముంబయిలో బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
సోమవారం బన్నీ.. ముంబయిలోని బన్సాలి ఆఫీసులో కలిసి బయటికి వచ్చి కారెక్కుతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఈ కలయిక సినిమా కోసమేనా.. మరో దాని కోసమా అన్న చర్చ నడుస్తోంది. పుష్ప-1, పుష్ప-2కు మధ్య బన్నీ వేరే సినిమా చేయాల్సింది కానీ.. తర్వాత అతడి ప్రణాళికలు మారిపోయాయి. ఐకాన్ మూవీని మొదలుపెట్టేలా కనిపించిన అతను.. దాన్ని పక్కన పెట్టేశాడు. తన ఫోకస్ మొత్తం పుష్ప-2 మీదికే మళ్లించినట్లు కనిపించాడు. మధ్యలో వేరే సినిమా చేస్తాడో లేదో తెలియదు కానీ.. పుష్ప-2 తర్వాత కూడా ఏ సినిమాకూ కమిట్ అయినట్లు సంకేతాలు కనిపించడం లేదు.
కొరటాల శివతో అనుకున్న సినిమా డోలాయమానంలో పడింది. పుష్ప-2తో పాన్ ఇండియా లెవెల్లో తన ఇమేజ్ ఇంకా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో.. బన్సాలీతో పాన్ ఇండియా సినిమా చేస్తే బాగుంటుందని చూస్తున్నాడేమో. బన్సాలీ కూడా సౌత్ హీరోలతో సినిమా చేయడానికి ఆసక్తితోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్‌తో బన్సాలీ సినిమా ప్లాన్ చేసినట్లు వార్తలొచ్చాయి కానీ.. అది వర్కవుట్ కాలేదు. మరి బన్సాలీ-బన్నీ మూవీ అయినా ఓకే అవుతుందేమో చూడాలి.
This post was last modified on March 14, 2022 11:58 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…