మాస్ రాజా రవితేజ కెరీర్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ‘ఖిలాడి’. దీనికంటే ముందు రవితేజ ‘క్రాక్’తో భారీ విజయాన్నందుకోవడం.. ప్రోమోలన్నీ ఆకర్షణీయంగా ఉండటంతో ‘ఖిలాడి’కి ప్రి రిలీజ్ హైప్ బాగానే కనిపించింది. దీనికి బిజినెస్ కూడా బాగా జరిగింది. టేబుల్ ప్రాఫిట్‌తో నిర్మాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాడు. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
అన్ని వనరులూ బాగా సమకూరినా.. దర్శకుడు రమేష్ వర్మ ఉపయోగించుకోలేకపోయాడు. బలహీనమైన కథాకథనాలతో సినిమా నీరుగారిపోయేలా చేశాడు. కొన్ని మూమెంట్స్, హీరోయిన్ల గ్లామర్ తప్ప సినిమాలో పెద్దగా హైలైట్లేమీ లేకపోయాయి. వీకెండ్ వరకు ప్రభావం చూపించిన ఈ చిత్రం.. తర్వాత డౌన్ అయిపోయింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఈ చిత్రాన్ని తాజాగా హాట్ స్టార్‌లో రిలీజ్ చేశారు. థియేట్రికల్ రిలీజ్ టైంలో టాక్‌తో సంబంధం లేకుండా పెద్ద సినిమా ఏది ఓటీటీలో వచ్చినా ప్రేక్షకులు బాగానే చూస్తారు.
వ్యూయర్ షిప్‌కు ఢోకా ఉండదు. సబ్‌స్క్రిప్షన్ ఉన్నపుడు సినిమా చూసేందుక కొత్తగా ఖర్చయ్యేదేమీ ఉండదు. సబ్‌స్క్రిప్షన్‌కు న్యాయం చేయడానికైనా సినిమా చూస్తారు. ఇలాగే ‘ఖిలాడి’కి కూడా బాగానే ఆదరణ దక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైన దగ్గర్నుంచి ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్న పేరు.. డింపుల్ హయతి. హీరో రవితేజను మించి ఈమె గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఆ స్థాయిలో సినిమాలో గ్లామర్ ఒలకబోసింది డింపుల్.
లేక లేక ఓ పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చేసరికి ఎక్స్‌పోజింగ్ పరంగా ఏమాత్రం తగ్గలేదు డింపుల్. ప్రతి పాటలో, అలాగే చాలా సన్నివేశాల్లో హాట్ హాట్‌గా కనిపించింది. ముఖ్యంగా సినిమాలో ఒక చోట బికినీలో హాట్ క్లీవేజ్‌తో మంటలు పుట్టించేసిందామె. మొన్నట్నుంచి సోషల్ మీడియాలో ఆ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. ఆమె కోసమే కుర్రాళ్లు ‘ఖిలాడి’ సినిమాను ఎగబడి చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా గ్లామరస్‌గానే కనిపించినా.. డింపుల్ ముందు ఆమె నిలవలేకపోయిందనే చెప్పాలి.
This post was last modified on March 14, 2022 8:00 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…