బాహుబలి.. భారతీయ ప్రేక్షకులను ఈ చిత్రం చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంతకంటే గొప్ప సినిమాలు చాలా ఉండొచ్చు కానీ.. దీని రీచ్, ఇది సాధించిన వసూళ్లు, దీని చుట్టూ నెలకొన్న యుఫోరియాను మ్యాచ్ చేయడం మాత్రం మరే సినిమాకూ సాధ్యం కాదనే చెప్పాలి. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా అందరు ప్రేక్షకులనూ మెప్పించి అసలు సిసలైన ‘ఇండియన్ సినిమా’ అనిపించుకుంది బాహుబలి. ‘ది కంక్లూజన్’తోనే బాహుబలి సినిమా ముగిసినా.. ఆ ప్రపంచాన్ని కొనసాగించాలన్న ఉద్దేశాన్ని ఇంతకుముందే చాటి చెప్పాడు జక్కన్న.
ఇక అప్పట్నుంచి ‘బాహుబలి-3’ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ తర్వాత ఆయన ‘ఆర్ఆర్ఆర్’లో బిజీ అయిపోవడం.. ఆపై మహేష్ మూవీని లైన్లో పెట్టడం.. మరోవైపు ‘మహాభారతం’పై మెగా మూవీ ఆయన కోసం ఎదురు చూస్తుండటంతో ‘బాహుబలి-3’పై అంతా ఆశలు వదులుకున్నారు.కానీ ఇప్పుడు జక్కన్న మళ్లీ ‘బాహుబలి-3’ ఊసెత్తడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి మాట్లాడారు. బాహుబలి-3 ఉంటుందా అని అడిగితే.. దీని చుట్టూ చాలా విషయాలు జరుగుతున్నాయని.. బాహుబలి ప్రపంచాన్ని భిన్న కోణాల్లో కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఇందులో భాగంగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని.. కచ్చితంగా బాహుబలి ప్రపంచం కొనసాగుతుందని.. త్వరలోనే ఒక ఎగ్జైటింగ్ న్యూస్ బయటికి వస్తుందని జక్కన్న చెప్పాడు.
ఆయనీ మాట చెప్పినప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి-3 చర్చలు ఊపందుకున్నాయి. ఇందులోనూ ప్రభాసే నటిస్తాడా.. ఇంకెవరైనా లీడ్ రోల్ కోసం తీసుకుంటారా..బాహుబలి కథనే కొనసాగిస్తారా.. లేక అలాంటి నేపథ్యంలో మరో కథను తెరపైకి తెస్తారా అని అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
This post was last modified on March 14, 2022 4:49 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…