ఒకప్పుడు టాలీవుడ్లో ప్రామిసింగ్ హీరోల్లో ఒకడిగా కనిపించాడు శర్వానంద్. పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి క్యారెక్టర్ రోల్స్‌తో పాటు నెగెటివ్ క్యారెక్టర్లు కూడా ట్రై చేసి నటుడిగా తనేంటో రుజువు చేసుకున్న అతను.. ఆ తర్వాత హీరోగానూ నిలదొక్కుకున్నాడు.
రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శతమానం భవతి, మహానుభావుడు లాంటి చిత్రాలతో తన మీద నిర్మాతలు ధైర్యంగా పాతిక కోట్ల బడ్జెట్లు పెట్టే భరోసా కల్పించాడు. కానీ గత కొన్నేళ్లలో అతడికున్న పేరంతా పోయింది. వరుస ఫ్లాపులతో మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఇప్పుడు శర్వా మీద పది కోట్లు పెట్టినా తిరిగొస్తుందన్న గ్యారెంటీ లేకపోయింది. అతడి తాజా చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు ఫుల్ రన్ షేర్ రూ.5 కోట్లను కూడా దాటలేకపోవడం అనూహ్యం.
ఓపెనింగ్స్‌లోనూ బాగా దెబ్బ తిన్నట్లే ఉన్నాడు శర్వా. ఈ పరిస్థితుల్లో అతడికి కొత్తగా పేరున్న దర్శకులు, నిర్మాతల నుంచి ఛాన్సులు రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా.. వరుస పరాజయాలు పలకరిస్తే కెరీర్ డోలాయమానంలో పడాల్సిందే. శర్వా పరిస్థితి కూడా అంతే. చర్చల్లో ఉన్న కొత్త సినిమాలు కూడా ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడిక అతడి ఆశలన్నీ ‘ఒకే ఒక జీవితం’ మీదే ఉన్నాయి.
ఇది బేసిగ్గా తమిళ చిత్రం. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన ఎస్.ఆర్. ప్రభు నిర్మించాడు. దీని టీజర్ కొన్ని నెలల కిందట రిలీజై బాగానే ఆకట్టుకుంది. ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన వైవిధ్యమైన సినిమా. ప్రోమోలైతే ప్రామిసింగ్‌గా కనిపించాయి. మరి ఈ చిత్రమైనా శర్వా ఫ్లాపుల పరంపరకు అడ్డు కట్ట వేసి అతడికి ఉపశమనాన్నిస్తుందేమో చూడాలి. ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.
This post was last modified on March 14, 2022 10:15 am
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…