ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి చాలా చోట్ల మిశ్రమ స్పందన వస్తోంది. మీడియాలో కూడా నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో సినిమా తీసినా.. ఎమోషన్స్ మిస్ అయ్యాయని.. అలాంటి కథకు భారీ సెట్లు, ప్రభాస్ లాంటి హీరో అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా అయితే ఈ సినిమాను టార్గెట్ చేసిందనే చెప్పాలి.
ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ అయితే ఈ సినిమా బాలేదని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. చాలా మంది బాలీవుడ్ జనాలకు ఈ సినిమా నచ్చలేదు. కొందరు క్రిటిక్స్ అయితే ప్రభాస్ వయసుని ఎత్తిచూపిస్తున్నారు. ప్రముఖ రచయిత్రి, ఫిల్మ్ క్రిటిక్ అనుపమ్ చోప్రా ‘రాధేశ్యామ్’ సినిమాకి రివ్యూ ఇచ్చింది. ఆమె రివ్యూ చూస్తే కాస్త పర్సనల్ లెవెల్ లోకి వెళ్లి మరీ ఇచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది.
ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ నటించింది. ఈ కాంబినేషన్ అనుపమ చోప్రాకి నచ్చలేదు. 42 ఏళ్ల వయసున్న ప్రభాస్ కి 52 ఏళ్ల భాగ్యశ్రీని తల్లిగా పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించింది. వయసు చూసుకొని రోల్స్ ఇవ్వాలంటూ సజెషన్ కూడా ఇచ్చింది. ఈమె రివ్యూ చూసిన మిగిలిన బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఇదే పాయింట్ ను హైలైట్ చేస్తూ రివ్యూ ఇచ్చారు.
కొందరైతే భాగ్యశ్రీ.. ప్రభాస్ కి చెల్లిలా ఉందంటూ వెటకారంగా రాశారు. బాలీవుడ్ కి చెందిన భాగ్యశ్రీపై వారికి అభిమానం ఉండొచ్చు కానీ ఇలా ప్రభాస్ ని తక్కువ చేస్తూ ఆమె పొగడాల్సిన అవసరం లేదు. ఆ విషయానికొస్తే.. బాలీవుడ్ లో 60 ఏళ్లకు దగ్గర పడిన స్టార్ హీరోలు 20 ఏళ్ల ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తుంటారు. మరి అప్పుడు ఏజ్ విషయం ఎందుకు మాట్లాడలేదో..? సినిమా ఇండస్ట్రీలో నటనకు వయసుతో సంబంధం లేదనే విషయాన్ని ముందు గ్రహించాలి.
This post was last modified on March 12, 2022 6:55 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…