స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ పెట్టాలంటే పెద్ద కసరత్తే జరుగుద్ది. అది తన ఇమేజ్‌కి తగ్గట్టు ఉండాలి. కాన్సెప్ట్‌ని కన్వే చేయగలగాలి. అలాగే క్యాచీగానూ ఉండాలి. రామ్ చరణ్ మూవీకి కొత్త మూవీకి కూడా ఇవన్నీ పరిశీలించి ఓ టైటిల్‌ను ఫిక్స్ చేశారట.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదో పొలిటికల్ డ్రామా. చెర్రీ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఎలక్షన్ ఆఫీసర్‌గా డ్యూటీ చేస్తున్నప్పుడు తనకి, ముఖ్యమంత్రి ఎస్‌జే సూర్యకి మధ్య తలెత్తే వివాదం చుట్టూ కథ నడుస్తుందని టాక్. ఇది ‘ఒకే ఒక్కడు’కి సీక్వెల్ అనే ప్రచారం కూడా జరుగుతోంది.
అందుకే ఫస్ట్ పార్ట్‌కి అంత మంచి టైటిల్ పెట్టిన శంకర్ ఈ సినిమాకి ఏం పేరు పెడతాడా అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పలు టైటిళ్లను పరిశీలించాడట శంకర్. చివరికి ‘సర్కారోడు’ అనే పేరు పెట్టాలని డిసైడయ్యాడట. రామ్ చరణ్ బర్త్ డే నాడు టైటిల్‌ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే ఈ టైటిల్ యాప్ట్ అనే చెప్పాలి. కానీ ఆల్రెడీ సర్కార్ మూవీ రావడం వల్ల ఇది మెగా ఫ్యాన్స్‌కి అంత నచ్చుద్దా అనేది డౌట్. పైగా శంకర్ సినిమాకి మరీ ఇంత మాస్ టైటిల్‌ని జనాలు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఆయన స్టైల్లో కాస్త స్టైలిష్‌గా ఉండే పేరుని కోరుకుంటారు. ఆ విషయాన్ని శంకర్ గ్రహిస్తాడో లేదో మరి.
This post was last modified on March 9, 2022 6:26 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…