ఓ మంచి సినిమా తీయడం అందరికీ సాధ్యం కాదు. ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు తీయడం అంత తేలిక కూడా కాదు. ఎంతో కష్టపడి, ఎన్నో కలలు కని అలాంటి సినిమా తీస్తే.. మనోభావాల పేరుతో దానికి అడుగడుగునా ఆటంకాలు ఏర్పడితే.. ఆ బాధ ఎలా ఉంటుందో ఆ సినిమా తీసినవారికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడా బాధని తాను పడుతున్నానంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.
కశ్మీర్‌లో హిందూ పండిట్స్ మీద జరిగిన అఘాయిత్యాలను చూపించేందుకు ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమాని తీశాడు వివేక్. ఆమధ్య ట్రైలర్ చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. అయితే రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసిన చాలా సినిమాల్లాగే ఇదీ వివాదాల్లో చిక్కుకుంది. మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా ఉందంటూ కొందరు కోర్టుకెక్కారు కూడా. అయితే రీసెంట్‌గా కోర్టు దాన్ని కొట్టేసింది. ముందుగా చెప్పినట్టే మార్చ్ 11న సినిమాని విడుదల చేసుకోవచ్చని తీర్పిచ్చింది. అయితే తన సినిమా చాలా కోతల తర్వాత బైటికి రాబోతోందని వాపోతున్నాడు వివేక్.
అభ్యంతరకరమని చెబుతూ ఓ టెర్రరిస్ట్ ఇంట్లో ఉన్న మాజీ ప్రధాని ఫొటోని తీసేశారు. మూడు చోట్ల రేప్ అనే పదాన్ని తొలగించారు. భారత జాతీయ జెండా నేలపై పడే షాట్‌ని తీసేశారు. ఓచోట టెలివిజన్ లోగోను, మరో చోట చానెల్ పేరును మార్చారు. ఇలా ఏడు కోతలు విధించాకే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందట. అది కూడా ఎ. పెద్దలు మాత్రమే ఈ సినిమా చూడాలట. పిల్లలు చూస్తే వారిపై దుష్ప్రభావం పడే ప్రభావం ఉందట.
నిజానికి ఈ సెవెన్ కట్స్ ఫర్వాలేదని, మొదట అంతకంటే దారుణమైన అభ్యంతరాలు చెప్పారని వివేక్ అంటున్నాడు. ‘దాదాపు ఇరవై అయిదు కట్స్ వరకు చెప్పారు. అవన్నీ తీసేస్తే ఇక సినిమా ఏముంటుంది? అందుకే రెండు నెలలపాటు పోరాడాను. నేను తీసిన ప్రతిదీ వాస్తవంగా జరిగినదేనని సాక్ష్యాలు చూపించాను. దాంతో సెవెన్ కట్స్‌తో అనుమతి దొరికింది’ అని చెప్పాడు వివేక్. ఇప్పటికే ఇన్ని కష్టాలు పడి వస్తున్న ఈ సినిమా.. విడుదల తర్వాత ఎలాంటి అలజడి సృష్టిస్టుందో ఏమో!
This post was last modified on March 9, 2022 1:15 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…