దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్లో హీరోగా కొనసాగుతున్నాడు షాహిద్ కపూర్. స్టార్ ఇమేజ్ ఎప్పుడో సంపాదించాడు కానీ.. సూపర్ స్టార్ల స్థాయికి మాత్రం చేరలేకపోయాడు. వసూళ్లలో ఒక స్థాయిని మించి ఎదగలేకపోయాడు. అలాంటి హీరోకు గత ఏడాది భారీ విజయాన్నందించి టాప్ లీగ్ హీరోలతో పోటీ పడే స్థాయిని అందించింది కబీర్ సింగ్.
ఇది ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్.. వెంటనే మరో తెలుగు రీమేక్‌ను లైన్లో పెట్టాడు. అదే.. ‘జెర్సీ’. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ కూడా మొదలుపెట్టుకుంది. లాక్ డౌన్ లేకుంటే ఈ పాటికి పూర్తయ్యేది కూడా.
ఐతే జెర్సీ రీమేక్ ఇంకా పూర్తి కాకుండానే షాహిద్ వరుసగా మూడో రీమేక్‌కు ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈసారి చేయబోయేది తెలుగు సినిమా కాదు కానీ.. సౌత్ మూవీ. అది తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఆ చిత్రమే.. ఆకాశమే నీ హద్దురా. సూర్య హీరోగా తెలుగమ్మాయి సుధ కొంగర తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన చిత్రమిది.
ఇది ఒక నిజ జీవిత కథే. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించింది సుధ. టీజర్‌తోనే చాలా ప్రామిసింగ్‌గా కనిపించిందీ సినిమా. ఈ చిత్రం గురించి తెలుసుకున్న షాహిద్ రీమేక్‌లో నటించడానికి ఓకే చెప్పాడట. నిర్మాత గునీత్ మోంగా రీమేక్ హక్కులు కొన్నాడట. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయట.
This post was last modified on June 18, 2020 12:53 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…