Movie News

మహేష్ కోసం ఆలియా?

రాజమౌళి సినిమాలో నటిస్తే ఏ యాక్టర్‌‌ కెరీర్ అయినా మలుపు తిరగాల్సిందే. ఇక హీరో హీరోయిన్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. మోస్ట్ వాంటెడ్ అయిపోతారు. ఆలియా భట్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. నిజానికి ఆలియా ఆల్రెడీ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ దెబ్బకి టాలీవుడ్‌లోనూ టాప్ ప్రయారిటీ అయిపోయింది. ప్రతి స్టార్ హీరో సినిమా విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.       

‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ కాకముందే ఎన్టీఆర్‌‌ సినిమాలో ఆలియా హీరోయిన్‌గా నటించబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆల్రెడీ కొరటాల శివ ఆమెతో మాట్లాడాడని, తను కూడా ఓకే అందనే ప్రచారం మొదలైంది. రీసెంట్‌గా ఓ సందర్భంలో దీని గురించి అడిగితే ఆలియా కూడా అది జరిగితే జరగొచ్చు అంది తప్ప కొట్టి పారేయలేదు. దాంతో ఆమె ఎన్టీఆర్‌‌తో జోడీ కడుతోందనే నమ్మకం వచ్చేసింది నందమూరి ఫ్యాన్స్‌కి. ఇప్పుడు మహేష్‌ బాబు మూవీ విషయంలోనూ ఆలియా పేరు బైటికొచ్చింది.       

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్‌కి వెళ్లనుంది. మరోవైపు రాజమౌళితో కూడా తనకి కమిట్‌మెంట్ ఉంది. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు  ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ అడ్వెంచరస్‌ మూవీలో హీరోయిన్‌గా ఆలియా నటించనుందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే చర్చలు ముగిశాయట. త్వరలోనే అనౌన్స్‌మెంట్ వస్తుందని కూడా అంటున్నారు.        

‘ఆర్‌ఆర్‌ఆర్‌‌’లో చేసింది చిన్న పాత్రే అయినా ఆలియా పర్‌‌ఫార్మెన్స్‌ చూసి ఇంప్రెస్ అయిపోయిన జక్కన్న.. ఈసారి తన సినిమాలో ఆమెని ఫుల్‌ లెంగ్త్ క్యారెక్టర్‌‌లో చూపించాలని డిసైడయ్యాడట. అందుకే తనని సెలెక్ట్ చేసుకున్నాడట. ఆయన అడిగితే ఎవరు మాత్రం కాదంటారు! ఆయన డైరెక్షన్‌లో నటించే చాన్స్‌ ఎవరు వదులుకుంటారు! అందుకే ఆలియా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇదే కనుక నిజమైతే ఇంతవరకు బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో వెలుగుతున్న ఆలియా ఇక టాలీవుడ్‌నీ షేక్ చేయడం ఖాయం. 

This post was last modified on March 7, 2022 11:19 pm

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

3 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

3 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 hours ago