చేసిన సినిమాలతో కంటే సింగర్ నోయల్‌తో పెళ్లి, విడాకులతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఎస్తేర్ నొరోహా. ఈమధ్య యూ ట్యూబ్ చానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ బాగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. వీటిలో తన కెరీర్ కంటే పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువ విషయాలు చెప్పింది. ఇప్పుడిక తన దృష్టి మొత్తం కెరీర్ పైనే అంటోంది.
సునీల్ కుమార్ రెడ్డి డైరెక్షన్‌లో ‘69 సంస్కార్ కాలనీ’ అనే సినిమాలో నటించింది ఎస్తేర్. మార్చ్ 18న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో కాసేపు కబుర్లాడింది. ఇందులో వైశాలి అనే హౌస్ వైఫ్ పాత్రలో కనిపిస్తుందట ఎస్తేర్. ఇలాంటి పాత్రలో నటించినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ సంబర పడుతూ చెబుతోంది.
సునీల్ కుమార్ రెడ్డి సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది కూడా అందుకు ఏమాత్రం తీసిపోదని ట్రైలర్ చూస్తే అర్థమయ్యింది. చాలా బోల్డ్‌గా ఉందనే నెగిటివ్ కామెంట్స్ రావడం మొదలైంది. కానీ ఎస్తేర్ మాత్రం సినిమాని, తన పాత్రని వెనకేసుకొస్తోంది. అసలు ఈ సినిమా కథలో తనకి నచ్చిందే బోల్డ్‌నెస్ అని, దాని కోసమే ఒప్పుకున్నానని చెప్పింది. చాలామంది జీవితాల్లో బోల్డ్‌నెస్ ఉంటుందని, ఎవరూ పైకి చెప్పరని, సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడానికే తీసిన ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉందని అంటోంది.
నిజానికి కెరీర్ ప్రారంభంలో వెయ్యి అబద్ధాలు, భీమవరం బుల్లోడు లాంటి సినిమాల్లో మంచి పాత్రలే చేసింది ఎస్తేర్. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్‌కి ఒప్పుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆమె నటించిన మరో సినిమా కూడా త్వరలో రిలీజవుతుందట. ఇంకో సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా చేతిలో ఉందట. మరి వాటిలో ఎలాంటి పాత్రలు చేయనుందో.
This post was last modified on March 7, 2022 11:34 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…