డీజే టిల్లు.. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ చిన్న సినిమానే అని చెప్పాలి. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. రిలీజ్ ముంగిట అనూహ్యమైన బజ్ తెచ్చుకుంది. ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన యువత.. డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ చేసే హడావుడి చూడటానికి థియేటర్లకు పరుగులు పెట్టేశారు.
‘ఖిలాడి’ లాంటి పెద్ద సినిమాతో పోటీపడి ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలవడం విశేషం. సినిమా స్థాయిని మించి బయ్యర్లు కాస్త ఎక్కువ పెట్టుబడే పెట్టినా.. వాళ్లందరికీ భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. చేసిన బిజినెస్‌కు రెట్టింపు స్థాయిలో దీనికి షేర్ రావడం విశేషం. ఓవరాల్ షేర్ రూ.10 కోట్ల మార్కును దాటిపోవడం గమనార్హం. ‘భీమ్లా నాయక్’ వచ్చే వరకు ఈ సినిమానే బాక్సాఫీస్‌ను లీడ్ చేసింది. థియేట్రికల్ రన్ ముగిశాక ‘డీజే టిల్లు’ ఓటీటీ బాట పట్టి అక్కడా సంచలనం రేపుతోంది.
‘డీజే టిల్లు’ ఆహాలో ఈ శుక్రవారమే రిలీజైంది. డిజిటల్ రిలీజ్ ముంగిట ఆహా వాళ్లు కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాను బాగానే ప్రమోట్ చేశారు. థియేటర్లలో సినిమా చూడని వాళ్లు, అలాగే చూసిన వాళ్లు కూడా ‘ఆహా’లో ఈ సినిమా కోసం ఎగబడుతున్నట్లే కనిపిస్తోంది. కేవలం 48 గంటల వ్యవధిలో ఈ చిత్రం 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ పూర్తి చేసుకోవడం విశేషం.
ఓ చిన్న సినిమాకు ఇంత తక్కువ సమయంలో ఇంత స్ట్రీమింగ్ సమయం పూర్తి కావడం అంటే మాటలు కాదు. ఈ వీకెండ్లో ఇండియా మొత్తంలో అత్యధిక మంది వీక్షించిన… టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఓటీటీ సినిమాల జాబితాలోనూ ‘డీజే టిల్లు’ టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం. ఓటీటీ అప్‌డేట్స్ ఇచ్చే ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ ‘డీజే టిల్లు’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి.
‘డీజే టిల్లు’ ఓవరాల్‌గా అంత గొప్ప సినిమా కాకపోయినా.. ఇందులో డీజే టిల్లు పాత్రతో కనెక్ట్ అయితే చాలు పైసా వసూల్ అన్నట్లే. ఆ పాత్ర.. అందులో సిద్ధు నటన.. డైలాగ్స్.. ఇవి చాలు ఎంటర్టైన్ అయిపోవడానికి.
This post was last modified on March 6, 2022 3:20 pm
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…
బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్…
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి మారితే మరోలా మాట్లాడుతున్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై పోలీసు…