యువ కథానాయకుడు శర్వానంద్ ఒకప్పుడు ఎక్స్‌ప్రెస్ రాజా, రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి వరుస హిట్లతో మంచి ఊపు మీదుండేవాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు వచ్చినా.. మహానుభావుడుతో కొంచెం పుంజుకున్నట్లే కనిపించాడు. కానీ ఆ తర్వాత మాత్రం అతడికి చెప్పుకోదగ్గ హిట్టే లేదు. టాక్‌తో సంబంధం లేకుండా అతడి సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. జాను, శ్రీకారం లాంటి మంచి సినిమాలు కూడా ఆడలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన మహాసముద్రం ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే.
దీంతో ప్రయోగాలు పక్కన పెట్టి ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇప్పటికే మార్కెట్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో శర్వా ఈ చిత్రంతో కచ్చితంగా హిట్టు కొట్టి తీరాల్సిందే. లేదంటే అతడి కెరీర్‌కు చాలా ఇబ్బంది అవుతుంది. నేను శైలజ తర్వాత తనపై పెరిగిన అంచనాలను అందుకోలేకపోయిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.
రష్మిక మందన్నా లాంటి లక్కీ ఛార్మ్‌ను హీరోయిన్‌గా పెట్టుకుని.. రాధిక, ఖుష్బూ సహా ప్రముఖ తారాగణం.. దేవిశ్రీ ప్రసాద్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో ఈ చిత్రానికి ప్యాడింగ్ బాగానే కుదిరింది. పాటలు, టీజర్, ట్రైలర్.. ఇలా అన్ని ప్రోమోలు కూడా పాజిటివ్ ఫీల్ తీసుకొచ్చాయి. డీజే టిల్లు, భీమ్లా నాయక్ చిత్రాలతో బాక్సాఫీస్ ఊపందుకున్న టైంలో ఈ సినిమా రిలీజవుతోంది. వేసవి ముంగిట ఈ చిత్రం మంచి ఫలితాన్నందుకుంటుందనే ఆశలు టాలీవుడ్లో కలుగుతున్నాయి.
మరి అనుకూల పరిస్థితుల్లో మంచి బజ్‌తో వస్తున్న ఈ చిత్రంతో అయినా శర్వా హిట్టు కొడతాడా.. లేక తన ఫ్లాపుల పరంపరలోకి ఇంకో సినిమాను జత చేస్తాడా అన్నది చూడాలి. దీంతో పాటుగా యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ అనే చిన్న సినిమా కూడా రిలీజవుతోంది. ఆ సినిమా కూడా పాజిటివ్ బజ్ మధ్య రిలీజవుతోంది. మరి ఈ రెండు చిత్రాలకు శుక్రవారం ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
This post was last modified on March 4, 2022 7:49 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…