యుఎస్‌లో ఉండే తెలుగు ఎన్నారైల అభిరుచి తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రేక్షకులతో పోలిస్తే కొంచెం భిన్నమే. వాళ్లకు మాస్ సినిమాలు అంతగా నచ్చవు. అలాగే రీమేక్ సినిమాల పట్ల కూడా అంతగా ఆసక్తి చూపించరు. క్లాస్ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకే ఎక్కువగా పట్టం కడుతుంటారు. ఒక సినిమా చూడాలంటే వాళ్లు చాలా దూరం ప్రయాణించి, ఎక్కువ టికెట్ రేటు పెట్టాల్సి ఉంటుంది. అందుకే తమ అభిరుచికి భిన్నమైన సినిమాలు చూడటానికి అంతగా ఆసక్తి చూపించరు.
తాము చూడాలనుకున్న సినిమాలను ఆచితూచి ఎంచుకుంటుంటారు. కానీ కొందరు హీరోల విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ మారిపోతుంటాయి. వాళ్లు మాస్ సినిమాలు చేసినా.. రీమేక్ చిత్రాల్లో నటించినా.. ఏమీ పట్టించుకోకుండా థియేటర్లకు పరుగులు పెట్టేస్తుంటారు. అలాంటి హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు.గత ఏడాది యుఎస్ బాక్సాఫీస్ డల్లుగా ఉన్న టైంలో ‘వకీల్ సాబ్’ లాంటి లో బజ్ ఉన్న సినిమాతో సులువుగా మిలియన్ మార్కును టచ్ చేశాడు పవన్.
ఇప్పుడు ‘భీమ్లా నాయక్’తో మరింతగా వసూళ్ల మోత మోగిస్తున్నాడు. ఈ చిత్రం ప్రిమియర్లతోనే దాదాపు 9 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. తొలి వీకెండ్లో నిలకడగా వసూళ్లు సాధిస్తూ 2 మిలియన్ మార్కును దాటేసింది. సోమవారం వసూళ్లు డ్రాప్ అయినా.. మంగళవారం టికెట్ల ధరల్లో ఆఫర్లు కలిసి రావడంతో వసూళ్లు పుంజుకున్నాయి.
ఇప్పటికే ఆ చిత్రం అక్కడ 2.3 మిలియన్ డాలర్ల దాకా కలెక్షన్లు రాబట్టి.. 2.5 మిలియన్ మార్కు దిశగా అడుగులు వేస్తోంది. ఈ వీకెండ్ అయ్యేసరికి ఆ మార్కును కూడా దాటేయడం ఖాయం. ‘భీమ్లా నాయక్’ మాస్ సినిమా, పైగా రీమేక్. దీని మాతృక ‘అయ్యప్పనుం కోషీయుం’ రెండేళ్ల నుంచి అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. నిజానికి ఒరిజినలే యుఎస్ ఎన్నారైల అభిరుచికి దగ్గరగా ఉంటుంది. దాన్ని తెలుగులో మంచి మాస్ మసాలా సినిమాలా మార్చారు. అలాంటి సినిమాతో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం పవన్‌కే చెల్లింది.
This post was last modified on March 3, 2022 6:52 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…