టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ చాలా ఏళ్ల నుంచి ప్రభాస్ దగ్గరే ఉంది. మధ్యలో అతను మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయ్యాడు కూడా. బాలీవుడ్ సూపర్ స్టార్లను మించిన ఇమేజ్, మార్కెట్‌తో తిరుగులేని స్థాయిని అందుకున్న ప్రభాస్.. ఎప్పుడు పెళ్లి ఊసు ఎత్తినా సమాధానం దాటవేస్తూనే ఉంటాడు. కొన్నేళ్ల ముందు అయినా.. ఈ సినిమా అయ్యాక చేసుకుంటా.. ఆ సినిమా పూర్తయ్యాక ఆలోచిస్తా అనేవాడు కానీ.. ఈ మధ్య అయితే ఆ మాటలు కూడా మానేశాడు.
పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేనట్లుగా మాట్లాడుతున్నాడు. క్రమంగా విలేకరులు సైతం ప్రభాస్ పెళ్లి గురించి అతణ్ని అడగడం మానేశారు. ఐతే ప్రభాస్ నుంచి కొత్తగా ‘రాధేశ్యామ్’ అనే ప్రేమకథా చిత్రం వస్తుండటం.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో ప్రేమ గురించి డైలాగ్స్ ఉండటంతో ముంబయి మీడియా వాళ్లు ప్రభాస్‌ను ప్రేమ-పెళ్లి గురించి అడిగారు.
‘రాధేశ్యామ్’ రిలీజ్ ట్రైలర్లో ఒక చోట ‘‘ప్రేమ గురించి ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’’ అనే ఒక డైలాగ్ వస్తుంది. ఈ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. నిజ జీవితంలో ప్రేమపై మీ అంచనాలేమైనా తప్పాయా అని విలేకరులు ప్రభాస్‌ను అడిగితే.. ‘‘చాలాసార్లు ప్రేమ విషయంలో నా అంచనాలు తప్పాయి. అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు’’ అని బదులివ్వడం విశేషం.
ఈ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ప్రేమ విషయంలో చాలాసార్లు తన తన అంచనాలు తప్పాయి అంటే.. వేర్వేరు సందర్భాల్లో అతను ప్రేమలో ఉన్నాడా.. ఆ వ్యవహారాలు బెడిసికొట్టాయా.. అతను లవ్ ఫెయిల్యూరా.. అందుకే పెళ్లి పట్ల వ్యతిరేకత పెంచుకుని అటు వైపు అడుగు వేయట్లేదా అన్న చర్చ నడుస్తోంది. ఈ మధ్య ప్రభాస్ తీరు చూస్తుంటే మాత్రం అతడి జీవితం సినిమాలు, స్నేహితులకే అంకితమేమో.. ఇక అతను పెళ్లి చేసుకోడేమో అనిపిస్తోంది. ఇంతకుముందు ప్రభాస్ పెళ్లి పట్ల ఎంతో ఉత్సాహం చూపించిన కృష్ణం రాజు సైతం ఈ మధ్య ఆ విషయంలో మౌనం వహిస్తుండటాన్ని బట్టి ప్రభాస్ మూడు ముళ్ల బంధంలోకి వెళ్లడం సందేహంగానే కనిపిస్తోంది.
This post was last modified on March 3, 2022 4:14 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…