Movie News

అభిమానుల బాధ పవన్‌కు పట్టదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి తిరిగొచ్చినందుకు సంతోషించాలో.. వరుసబెట్టి రీమేక్ సినిమాలు చేస్తున్నందుకు బాధ పడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అభిమానులు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రీమేక్ సినిమాల పట్ల ఆసక్తి బాగా తగ్గిపోతోంది. ఇంటర్నెట్ విప్లవం, ఓటీటీల హవా కారణంగా సరిహద్దులు చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్నారు. మామూలుగానే వేరే భాషల్లో విజయవంతమైన సినిమాలను వెతికి వెతికి చూస్తున్న ప్రేక్షకులు.. ఫలానా సినిమా రీమేక్ అవుతోందని తెలియగానే మరింత ఆసక్తిగా వాటిని చూసేస్తున్నారు.

కథ సహా అన్ని విశేషాలు ముందే తెలిసిపోతున్నాయి. ఎవరైనా స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నాడంటే.. ఆ సినిమా గురించి ఎడతెగని చర్చలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. దీంతో ఎగ్జైట్మెంట్ అంతా పోతోంది. జనాల్లో ఏమాత్రం క్యూరియాసిటీ ఉండట్లేదు.అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి బడా స్టార్ రీమేక్ చేస్తున్నాడంటే సదరు సినిమా విశేషాలన్నీ ఓపెన్ అయిపోయినట్లే.

మార్పులు చేర్పులు చేస్తున్నా సరే.. స్ట్రెయిట్ సినిమా విషయంలో ఉండే ఎగ్జైట్మెంట్లో సగం కూడా ఇక్కడ ఉండదన్నది వాస్తవం. కానీ పవన్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా రీమేక్‌ల మీద రీమేక్‌లు చేసుకుపోతున్నాడు. రీఎంట్రీకి రీమేక్, పైగా ‘పింక్’  లాంటి క్లాస్, లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఎంచుకోవడం పట్ల అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కూడా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను లైన్లో పెట్టడంతో అసంతృప్తి తప్పలేదు. ఈ రెండు చిత్రాలనూ మెరుగ్గానే తీర్చిదిద్దినా కూడా స్ట్రెయిట్ సినిమాలకుండే ఎగ్జైట్మెంట్ మాత్రం వీటికి లేదు. అయ్యిందేదో అయ్యింది.. హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ రాబోతున్నాయి కదా అనుకుంటే ఇప్పుడు మళ్లీ రీమేక్ వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ చిత్రం ‘వినోదియ సిత్తం’ను పవన్ హీరోగా రీమేక్ చేస్తున్నారని ముందు నుంచే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు ఓకే అయిపోయిందని.. జీ స్టూడియోస్ నిర్మాణంలో ఈ సినిమా చేయడానికి ఒప్పందం కూడా కుదిరిందని.. ఒరిజినల్ డైరెక్టర్ సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తాడని, త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖర్లో సినిమాకు ముహూర్తం కూడా పెట్టేశారని అంటున్నారు. ఇదే నిజమైతే పవన్ అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత తప్పదు. రీమేక్‌ల విషయంలో ఎంత కంఫర్ట్ ఉన్నప్పటికీ.. అభిమానుల అభిరుచికి భిన్నంగా గ్యాప్ ఇవ్వకుండా మళ్లీ మళ్లీ పవన్ అవే చేయడమేంటో అర్థం కావడం లేదు.

This post was last modified on March 2, 2022 7:34 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

1 hour ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

9 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

9 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

10 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

10 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

11 hours ago