Movie News

శివరాత్రి భీమ్లా తాండవం

గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’. సినిమా అంచనాలకు తగ్గట్లే ఉండటం, భారీగా రిలీజ్ చేయడంతో తొలి రోజు, అలాగే తొలి వీకెండ్లో వసూళ్ల మోత మోగించిందీ సినిమా. మూడు రోజుల్లోనే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల షేర్ రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మాత్రమే ‘భీమ్లా నాయక్’కు రూ.54 కోట్ల దాకా షేర్ వచ్చింది వీకెండ్లో.

ఏపీలో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ 27 కోట్ల దాకా షేర్ రావడం విశేషమే. ఐతే వీకెండ్ తర్వాత భీమ్లా నాయక్ జోరు తగ్గింది. సోమవారం ఒక్కసారిగా వసూళ్లు పడిపోవడంతో బయ్యర్లలో ఆందోళన వ్యక్తమైంది. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పాజిటివ్ తెచ్చుకున్నా వీకెండ్ తర్వాత డ్రాప్ సహజమే కానీ.. ‘భీమ్లా నాయక్’ వసూళ్లు అనుకున్నదానికంటే తగ్గాయి. ఐతే మంగళవారం ఈ చిత్రం మళ్లీ బలంగా పుంజుకుంది. శివరాత్రి సెలవును ‘భీమ్లా నాయక్’ పూర్తిగా ఉపయోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదరగొట్టింది.

మార్నింగ్ షోలకు స్పందన ఓ మోస్తరుగా ఉండగా.. మధ్యాహ్నం నుంచి హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఫస్ట్ షో, సెకండ్ షోలకైతే ‘భీమ్లా నాయక్’ ఊపు మామూలుగా లేదు. అన్ని సెంటర్లలోనూ టికెట్లు దొరకడం కష్టమైపోయింది. అడ్వాన్స్ ఫుల్స్‌ పడ్డాయి. ప్యాక్డ్ హౌస్‌లతో థియేటర్లు కళకళలాడాయి. శివరాత్రి కావడంతో మిడ్ నైట్ కూడా చాలా చోట్ల షోలు వేశారు. అవి కూడా ఫుల్ అయ్యాయి. ఐదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘భీమ్లా నాయక్’కు రూ.7 కోట్ల షేర్ రావడం విశేషం.

యుఎస్‌లో సైతం సోమవారం డ్రాప్ అయిన వసూళ్లు.. మంగళవారం టీ మొబైల్ యాప్ ఆఫర్ల వల్ల పుంజుకున్నాయి. అమెరికాలో తొలి వీకెండ్లోనే 2  మిలియన్ మార్కును టచ్ చేసిన ‘భీమ్లా నాయక్’.. మంగళవారం 1.75 లక్షల డాలర్లు వసూలు చేసింది. వీకెండ్ తర్వాత ఒక్క రోజులో ఇంత వసూళ్లు రావడం విశేషమే. మొత్తంగా అక్కడ ఈ సినిమా వసూల్లు 2.3 మిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. 2.5 మిలియన్ మార్కును ఫుల్ రన్లో అందుకునే ఛాన్సుంది.

This post was last modified on March 2, 2022 4:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

10 minutes ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

20 minutes ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

23 minutes ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

40 minutes ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

2 hours ago