అక్కినేని నాగచైతన్య తన భార్యతో విడిపోయినప్పటి నుంచి పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టాడు. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘మనం’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సినిమా రిలీజ్ కాకముందే విక్రమ్, చైతు కలిసి మరో ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. అదే ‘దూత’. ఇదొక వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ సంస్థ చైతు-విక్రమ్ కాంబినేషన్ లో వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. నిజానికి చైతుకి హారర్ అంటే పెద్దగా నచ్చదు. కారణమేంటో తెలియదు కానీ ఆయన మాత్రం హారర్ కథలకు చాలా దూరంగా ఉంటారు. ఆ జోనర్ సినిమాలను కూడా చూడరట.
కానీ తొలిసారి ఆయన హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈరోజే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని చైతు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో పాటు ఓ కొటేషన్ ని కూడా పోస్ట్ చేశారు. ఈ సిరీస్ లో చైతు జర్నలిస్ట్ గా కనిపించబోతున్నారని సమాచారం.
ఆయనకు జోడీగా కోలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్ నటించనుంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే హారర్ కథ అని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందట. మొత్తం మూడు సీజన్లుగా ఈ సిరీస్ ను చిత్రీకరించనున్నారు. మొదటి సీజన్ ను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి తన డిజిటల్ డెబ్యూతో చైతు ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటారో చూడాలి!
This post was last modified on March 2, 2022 11:09 am
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…