పైకి కనిపించదు గానీ, చిత్రసీమ ఓ విష వలయం చుట్టూ తిరుగుతుంటుంది. కులం, కుటుంబం – ఇక్కడ పెద్ద పాత్రని పోషిస్తాయి. ఒకరు ఎదిగారంటే… దాని వెనుక కష్టం మాత్రమే ఉండదు. ఇంకేదో బలమైన అంశం… తోడై వస్తుంది. ప్రతిభావంతులు కనుమరుగైపోయారంటే దురదృష్టం మాత్రమే కారణం కాదు, దానికంటే బలమైన ఆయుధం ఏదో వాళ్లని చిదిమేసి ఉంటుంది. దానికి తోడు స్వీయ తప్పిదాలెక్కువ. వాటిలో ఫాల్స్ ప్రెస్టేజీ అతి ముఖ్యమైనది.
హీరోగా నలుగురు కళ్లల్లో పడడం ఆషామాషీ వ్యవహారం కాదు. ‘హీరో’ అనే ట్యాగ్ తగిలించుకుని తిరగడం – ఖరీదైన విషయమే. అందరితో పాటు లగ్జరీ కారులో తిరగాలి. గేటెడ్ కమ్యునిటీలో ఓ ఫ్లాటుండాలి. దర్శకుడెవరైనా కథ చెప్పడానికి రావడానికి.. ఓ ఆఫీసంటూ తెరవాలి. పీఆర్‌ని మెంటైన్ చేయాలి. పర్సనల్ మేకప్‌మెన్, కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ డ్రస్సెర్, పార్టీలకూ, సినిమా వేడుకలకు వెళ్లినప్పుడు కొత్త కొత్త దుస్తులు, వేసిన షూ మళ్లీ వేయకపోవడం… ఇలా ఎన్ని హంగులో. సినిమాలున్నంతకాలం ఇలాంటి ఖర్చులకు ఢోకా ఉండదు. కానీ అవకాశాలు తగ్గిపోతే, ఫ్లాపులు ఎదురైతే, పారితోషికాలు అందకపోతే..? – నెల తిరిగేసరికి లక్షలు ఇచ్చుకోవాల్సిందే. సినిమాల్లేవు కదా, లగ్జరీ ఆపేద్దామంటే కుదరని పని. లేనప్పుడే ఇంకా డాబు చూపించాలి. సినిమాలతో సంపాదించుకున్నవన్నీ రియల్ ఎస్టేట్‌లలో పెట్టుబడి పెట్టేస్తుంటారు. కార్లు కొనేస్తారు. వాటిని నెలసరి అవసరాల కోసం అమ్ముకోవడం కుదరదు. అందుకే వాటిని తీయలేరు. అప్పులు చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. వాటిని తీర్చడానికి కథలు నచ్చకపోయినా, కొన్నిసార్లు డబ్బుల కోసం సినిమాలు చేయాల్సివస్తుంటుంది. అలా.. హీరోల్ని ఫ్లాపులు చుట్టుముడుతుంటాయి. ఆ తరవాత.. వాళ్ల జీవితాలు మరింత భారం అవుతాయి.
ఇండ్రస్ట్రీలోని కొంతమంది పెద్ద నటులు ఆత్మహత్యలు చేసుకోవడానికీ, అజ్ఞాతవాసంలో ఉండిపోవడానికి ఇదే ప్రధానమైన కారణం. ఎక్కడాలేనంత డిప్రెషన్, మానసిక సమస్యలూ… చిత్రసీమలోనే ఎందుకు ఉంటాయి? అనడానికి ప్రధానమైన కారణం ఫాల్స్ ప్రెస్టేజే. దీన్ని దాటుకుని సింపుల్ జీవితానికి అలవాటు పడడం సినిమావాళ్లు అలవాటు చేసుకోవాలి. దాన్నో ప్రాక్టీస్ గా మొదలెట్టాలి. నా చుట్టూ ఎంత డబ్బున్నా, ఎన్ని హంగులున్నా నేను సింపుల్ గా బతకడానికే ఇష్టపడతా అని చెప్పడం కాదు. దాన్ని ఆచరించాలి. అదే చాలా మానసిక సమస్యలకు మందుగా పని చేస్తుంది.
This post was last modified on June 17, 2020 12:00 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…