సెంటిమెంట్ కొన‌సాగిస్తున్న బోయ‌పాటి

Boyapati

బోయ‌పాటి సినిమాల‌న్నీ గ్రాండ్ గా ఉంటాయి. కెమెరా… ఫ్రేమ్ చేస్తే, క‌నీసం పాతిక మంది ఆర్టిస్టులు క‌నిపిస్తారు. చిన్న పాత్ర‌కైనా పెద్ద న‌టుడ్ని తీసుకురావ‌డం, హీరోల్ని విల‌న్లుగా మార్చ‌డం బోయ‌పాటి స్టైల్‌. లెజెండ్‌లో జ‌గ‌ప‌తిబాబుని విల‌న్ గా మార్చాడు. స‌రైనోడులో ఆది పినిశెట్టికి నెగిటీవ్‌రోల్ ఇచ్చాడు.

మాజీ హీరోల్ని సైడ్ క్యారెక్ట‌ర్ల‌కు వాడుకోవ‌డం బోయ‌పాటికి బాగా ఆల‌వాటు. ‘తుల‌సి’లో ఓ పాత్ర కోసం శివాజీని తీసుకున్నాడు. ‘ద‌మ్ము’లో వేణుని ఎంపిక చేసుకుని ఆ సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. ఇప్పుడూ అంతే. బాల‌కృష్ణ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం యువ హీరోని ఎంచుకున్నాడు. త‌నే న‌వీన్ చంద్ర‌.

‘అందాల రాక్ష‌సి’తో ఆక‌ట్టుకున్నాడు న‌వీన్‌. అయితే ఆ త‌రవాత స‌రైన బ్రేక్ రాలేదు. ‘నేను లోక‌ల్‌’ తో విల‌న్ పాత్ర‌లో క‌నిపించాడు. హీరోగా త‌న‌కు అవ‌కాశాలు త‌గ్గుతున్నాయి. ఈనేప‌థ్యంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు పాత్ర‌ల‌పై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా బాల‌య్య సినిమాలో న‌వీన్ చంద్ర‌కు ఓ మంచి పాత్ర ప‌డింద‌ని తెలుస్తోంది.

ఇదే సినిమాలో శ్రీ‌కాంత్ కూడా న‌టిస్తున్నాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈలోగా న‌వీన్ కూడా ఫిక్స‌య్యాడు. బాల‌య్య – బోయ‌పాటిల‌ది క్రేజీ కాంబో. చిన్న చిన్న విష‌యాల‌పై కూడా బోయ‌పాటి ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడు. ఏ పాత్ర విష‌యంలోనూ రాజీ ప‌డ‌డం లేదు. మున్ముందు ఇంకెంత మంది వ‌చ్చి ఈ టీమ్ లో చేర‌తారో చూడాలి.