రంగస్థలం ఫార్మాట్ కావాలని అల్లు అర్జున్ అడగడంతో సుకుమార్ ‘పుష్ప’కి అంతా అదే సెటప్ చూసుకున్నాడు. బన్నీ గెటప్ చూడగానే ఇది కూడా రంగస్థలం మాదిరి అని అర్ధమైపోయింది. అందులో సమంతని డీ గ్లామరైజ్డ్ గా చూపించిన సుకుమార్ ఈసారి ముద్దుగుమ్మ రష్మిక అవతారం మార్చేస్తున్నారు. ఇందులో రష్మిక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.
చిత్తూరు యాసలో మాట్లాడుతూ రష్మిక చేసే అల్లరి అలా ఇలా ఉండదట. ఇందుకోసం రశ్మికకు కొన్ని ఆడియో రికార్డింగ్స్ పంపించి ఎలా మాట్లాడాలో నేర్చుకోమని సుకుమార్ ఆదేశించాడట. ఇందుకోసం ఆమెకు ఒక వీడియో ట్యూటర్ ని కూడా పెట్టినట్టు భోగట్టా. అలాగే వేషం పరంగా కూడా ఎలా కనిపించాలనే కచ్చితమయిన నియమావళి ఆమెకు ఎప్పుడో ఇచ్చేశారట.
ఈ పాత్ర కోసం రష్మిక ఎక్సయిట్ అవుతోంది కానీ ఇప్పట్లో షూటింగ్ కి మాత్రం రానని అంటోంది. బెంగళూరులో ఉన్న రష్మిక కనీసం మూడు నెలల వరకు అందుబాటులో ఉండదట. అప్పుడు కూడా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందట. ఇందులో ఎలాంటి మొహమాటాలకు తావు లేదని చెప్పేసిందట.
This post was last modified on June 17, 2020 2:30 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…