పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భీమ్లా నాయక్ విడుదల ఈ రోజే. ఇది మలయాళ బ్లాక్‌బస్టర్ అయ్యప్పనుం కోషీయుంకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రాన్ని ప్రకటించినపుడు రీమేకే కదా అని లైట్ తీసుకున్నారు జనాలు. కానీ పవన్ సినిమా అంటే.. రీమేక్ అయినా, స్ట్రెయిట్ అయినా, ఏ కాంబినేషన్లో చేసినా.. విడుదల సమయానికి హైప్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది.
భీమ్లా నాయక్‌కు హైప్ ఇంకాస్త ఎక్కువే వచ్చింది. భీమ్లా నాయక్‌కు సంబంధించిన ప్రతి ప్రోమో కూడా ఎగ్జైటింగ్‌గా ఉండటంతో రిలీజ్ టైం వచ్చేసరికి క్రేజ్ మల్టిప్లై అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కోసం అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరిగాయి భీమ్లా నాయక్‌కు.
ఐతే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టికెట్ల నియంత్రణ కొనసాగుతుండటంతో వసూళ్లపై గట్టి ప్రభావమే పడేలా ఉంది. అయినప్పటికీ సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే.. పవన్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఓ ఘనతను ఈ సినిమాతో పవర్ స్టార్ అందుకుంటాడనే అనిపిస్తోంది. పవన్ తర్వాత వచ్చిన హీరోలు కూడా వంద కోట్ల షేర్ మార్కును టచ్ చేయగా.. సరైన టైంలో సరైన సినిమాలు పడక పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఆ క్లబ్బులో చేరలేదు.
గత ఏడాది వకీల్ సాబ్‌తో క్లబ్బులో అడుగు పెట్టేలాగే కనిపించాడు కానీ.. ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపుకు తోడు.. కొవిడ్ కారణంగా మధ్యలో థియేట్రికల్ రన్ ఆగిపోవడంతో 90 కోట్ల ప్లస్ షేర్‌తో సరిపెట్టుకుంది ఆ చిత్రం. ఐతే భీమ్లా నాయక్‌కు ఉన్న క్రేజ్.. తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు.. తెలుగు రాష్ట్రాల అవతల కూడా సినిమాకున్న క్రేజ్, భారీ రిలీజ్ దృష్ట్యా వంద కోట్ల షేర్ మార్కును టచ్ చేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on February 25, 2022 9:50 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…