కొవిడ్ దెబ్బకు కుదేలైన ఫిలిం ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా మంచి సహకారమే అందిస్తోంది. ఓవైపు ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించి, అదనపు షోలు, బెనిఫిట్ షోల విషయంలో ఉక్కు పాదం మోపుతుంటే తెలంగాణ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా టికెట్ల ధరలు పెంచారు. పైగా పెద్ద సినిమాలకు తొలి రెండు వారాలు ఇంకా రేట్లు పెంచుకోవడానికి అవకాశమిస్తున్నారు. అలాగే అదనపు షోలు వేసుకోవడానికి కూడా సులువుగా అనుమతులు లభిస్తున్నాయి.
బెనిఫిట్ షోలు లేవన్న మాటే తప్ప ఇంకే ఇబ్బందీ లేదు. ఈ శుక్రవారం రిలీజవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌కు ఆల్రెడీ రెండు వారాల వరకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. దీనికి తోడు ఇప్పుడు ఐదో షోకు కూడా అనుమతులు వచ్చేశాయి. బుధవారం సాయంత్రం నుంచే తెలంగాణ అంతటా ఐదో షోలు అందుబాటులోకి వచ్చేశాయి.
బుక్ మై షోలో బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇప్పటికే తొలి రోజు మొత్తానికి ఉన్న షోలన్నీ సోల్డ్ ఔట్ అయిపోవడంతో.. ఈ ఎక్స్ ట్రా షో కోసమే అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఇలా బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే అలా టికెట్లు అయిపోయాయి. తొలి రోజు మొత్తానికి ఎక్కడా ఇప్పుడు టికెట్లు దాదాపు అందుబాటులో లేవు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆంధ్రాలో అందుకు పూర్తి భిన్నం.
అదనపు షోలు, బెనిఫిట్ షోలు వేయడానికి వీల్లేదని అక్కడి అధికారులు నొక్కి వక్కాణిస్తున్నారు. తెలియకుండా, అనధికారికంగా షోలు వేస్తారేమో అని పోలీసులు తొలి రోజు ఉదయం నుంచి భీమ్లా నాయక్ థియేటర్ల దగ్గర తనిఖీలకు వెళ్లబోతున్నారట. కొత్త టికెట్ల ధరలు ఈపాటికే అమల్లోకి రావాల్సి ఉన్నా.. ఈ చిత్రానికి ప్రయోజనం దక్కకూడదన్న ఉద్దేశంతో కావాలనే జీవోను ఆపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
This post was last modified on February 24, 2022 9:25 am
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…