పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయ్యాక అంచనాలు ఇంకా పెరుగుతాయనుకుంటే.. ఆ హైప్‌ను ట్రైలర్ కొంచెం తగ్గించేసిందనే చెప్పాలి. ట్రైలర్లో ఉండాల్సినంత ఎలివేషన్ లేదన్నది వాస్తవం. అందుకు ప్రధాన కారణం బ్యాగ్రౌండ్ స్కోర్ సరిగా లేకపోవడం. ఇప్పటిదాకా రిలీజైన ప్రతి ప్రోమోలోనూ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆహా అనిపించిన తమన్.. ట్రైలర్ విషయంలో మాత్రం హడావుడి పడ్డట్లుగా కనిపిస్తోంది.
సౌండ్ డిజైనింగ్ విషయంలో తేడా కొట్టి ట్రైలర్ ఇంపాక్ట్ తగ్గిపోయింది. ఓవరాల్‌గా ట్రైలర్ కట్ కూడా ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయాలు కలిగాయి. ఈ నేపథ్యంలో అభిమానులు తమ క్రియేటివిటీని ఉపయోగించి ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ కొత్త వెర్షన్లు తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం విశేషం. ఒరిజినల్ ట్రైలర్ కంటే ఇవి చాలా మెరుగ్గా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ‘రిపబ్లిక్’ మూవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన సతీష్ బొట్ట శ్రీకర్ అనే నెటిజన్ కట్ చేసిన ట్రైలర్‌ను ట్విట్టర్లో షేర్ చేశాడు. అతనేమీ కొత్తగా బ్యాగ్రౌండ్ స్కోర్ చేయలేదు. కొత్తగా సన్నివేశాలు, డైలాగులేమీ సృష్టించలేదు. ఇంతకుముందు టీజర్లలో, అలాగే ట్రైలర్లో వినిపించిన డైలాగులు, కనిపించిన షాట్లు తీసుకుని.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా వాటి నుంచే వాడుకుని వారెవా అనిపించే ట్రైలర్ కట్ రెడీ చేశాడు.
ప్రొఫెషనల్ ఎడిటర్లను మించి ఔట్ పుట్ రావడంతో నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ట్రైలర్‌లో ప్రత్యేకతంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌ను బ్యాగ్రౌండ్లో సమయోచితంగా వాడుకోవడంలోనే ఉంది. మంచి కిక్కిచ్చే ఆ పాటతోనే ఈ ట్రైలర్‌కు ఊపొచ్చింది. ఈ ట్రైలర్ కట్ చూసి దర్శకుడు హరీష్ శంకర్ సైతం ఇంప్రెస్ అయ్యాడు. ఇక పవన్ అభిమానుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ ఇలా కట్ చేస్తే ఆ ఊపే వేరుగా ఉండేదని.. ట్రైలర్లో తప్పు జరిగినా సినిమాలో ఇలాంటి లోపాలు రాకుండా చూసుకోవాలని చిత్ర బృందానికి సలహాలిస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on February 23, 2022 5:30 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…