తెలుగు సినిమా టైటిల్ పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. టైటిల్ క్యాచీగా ఉండాలి. పద్ధతిగా ఉండాలి. దానికి ఎలాంటి లిటిగేషన్లూ ఎదురు కాకూడదు. ఏదైనా పవర్‌ఫుల్ పేరో, పదమో వాడుకుంటే.. అదో కొత్త తలనొప్పి. ఆ పేరుతో సంబంధం ఉన్నవాళ్లంతా పొలో మంటూ.. వెంటపడతారు. ‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ విడుదలకు అడ్డుకట్ట వేస్తారు.
సరిగ్గా ‘భానుమతి రామకృష్ణ’కి అదే జరుగుతుతోంది. ‘అందాల రాక్షసి ఫేమ్’ నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రమిది. త్వరలోనే ఓటీటీలో రాబోతోంది. చిత్రబృందం ఓటీటీ విడుదలకు సన్నాహాలు చేస్తుంటే, ఇప్పుడు టైటిల్ టెన్షన్ వచ్చి పడింది. అలనాటి నటి భానుమతి రామకృష్ణ కుటుంబ సభ్యులు ఈ టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మా అనుమతి లేనిదే టైటిల్ ఎలా వాడుకుంటారని వాళ్ల మొదటి ప్రశ్న. ఆ టైటిల్ పెట్టి, భానుమతిని కించపరిచే దృశ్యాలతో సినిమా తీశారన్నది మరో వాదన. మొదటి అభ్యంతరం సరైనదే. ఇక రెండోదంటారా? భానుమతిని కించపరిచారా, లేదా? అనేది సినిమా విడుదలైతే గానీ తెలీదు.
అందుకే చిత్రబృందం.. ‘ముందు మీకు ఈ సినిమా చూపిస్తాం. అప్పుడు అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఆయా సన్నివేశాలు తొలగిస్తాం’ అంటూ వివరణ ఇచ్చుకుంది. ‘భానుమతి రామకృష్ణ’ ఓ ఫ్యామిలీ డ్రామా. ఇందులో వివాదాస్పదమైన అంశాలు ఉండే ఛాన్సు లేదు. కాకపోతే.. భానుమతి పేరుతో ఓ బయోపిక్ నిర్మించాలని దానికి ‘భానుమతి రామకృష్ణ’ అనే టైటిల్ పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పేరు మరో సినిమా వాడుకుంటే.. ఇబ్బందే కదా, అందుకే టైటిల్ విషయంలో కుటుంబ సభ్యులు అభ్యంతరాలు చెబుతున్నారంతే. ఏదేమైనా.. ఈ చిన్న సినిమాకి ఈ విధంగా కాస్త పబ్లిసిటీ వచ్చినట్టైంది. అంతే.
This post was last modified on June 16, 2020 4:10 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…