ఒకప్పుడు హిట్టు మీద హిట్టు కొట్టే శర్వానంద్ కెరీర్ గ్రాఫ్ ఈ మధ్య బాగా డౌన్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘మహాసముద్రం’, ‘జాను’ లాంటి సినిమాలు కూడా శర్వాని నిరాశ పరిచాయి. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
దీంతో కచ్చితంగా హిట్ కొడతానని నమ్మకంగా ఉన్నారు శర్వానంద్. ఈ సినిమా తరువాత శర్వా ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు. చాలా మంది స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ డాన్స్ మాస్టర్. కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ.. కొన్నాళ్లుగా డైరెక్టర్ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు రాజు సుందరం.
కొన్నేళ్లక్రితం అజిత్ హీరోగా తమిళంలో ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. అది పెద్దగా ఆడకపోవడంతో రాజు సుందరంకి దర్శకుడిగా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారాయన. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల కోసం కథలు రాసుకున్నారు. కానీ ఏ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా తెలుగులో ఈయనకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను రాజు సుందరం డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా తరువాత శర్వానంద్ నటించబోయే సినిమా ఇదే. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను తెరకెక్కించనున్నారట. త్వరలోనే అఫీషియల్ గా సినిమాను మొదలుపెట్టనున్నారు.
This post was last modified on February 21, 2022 8:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…