అనతి కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. రచయితగా కెరీర్ స్టార్ చేసిన ఈయన.. నందమూరి కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `పటాస్` మూవీతో డైరెక్టర్‌గా ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుస హిట్ చిత్రాలను రూపొందించి అపజయం అంటూ లేని దర్శకుల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయిన అనిల్ రావిపూడి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలనూ షేర్ చేసుకున్నారు.
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నన్ను ర్యాగింగ్ చేశాడంటూ ఓ షాకింగ్ విషయాన్ని కూడా బయట పెట్టేశారు. `పటాస్ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తరచూ ఆఫీస్‌కి వస్తుండేవారు. ఆయన వచ్చినప్పుడల్లా నన్ను తెగ ర్యాగింగ్ చేసేవారు. ర్యాగింగ్ అంటే బాధ పెట్టడం కాదు అల్లరి చేస్తూ నా పై జోకులు వేసేవారు. నాకది ఎంతో మెమరబుల్ ఎక్స్పీరియన్స్` అంటూ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
దాంతో ఆయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన `ఎఫ్ 2`కు ఇది సీక్వెల్. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
This post was last modified on February 21, 2022 3:35 pm
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…