ఒకప్పుడు తెలుగు సినిమాలు యుఎస్‌లో ఏ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించేవో అందరికీ తెలిసిందే. మంచి క్రేజున్న సినిమాలకు ప్రిమియర్స్‌తోనే మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చేవి. ఐతే కొవిడ్,ఇతర కారణాల వల్ల మూడేళ్లుగా ఏ తెలుగు చిత్రానికీ యుఎస్‌లో ప్రిమియర్స్‌తో మిలియన్ డాలర్ల వసూళ్లు రాలేదు. చివరగా ఈ ఘనత అందుకున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ కావడం గమనార్హం. ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయినప్పటికీ.. విడుదలకు ముందు దానికి క్రేజ్ మామూలుగా లేదు.
దీంతో యుఎస్ ప్రిమియర్స్‌కు వసూళ్ల మోత మోగిపోయింది. ఏకంగా 1.4 మిలియన్ డాలర్లను కేవలం ప్రిమియర్స్‌తోనే వసూలు చేసింది ‘అజ్ఞాతవాసి’. బాహుబలి: ది బిగినింగ్, ఖైదీ నంబర్ 150 చిత్రాల రికార్డులను ఆ సినిమా బద్దలు కొట్టింది. ఐతే తర్వాతి మూడేళ్లలో మరే చిత్రం కూడా ఈ రికార్డును టచ్ చేయలేకపోయింది. కొవిడ్ దెబ్బకు యుఎస్‌లో భారతీయ చిత్రాలన్నింటికీ వసూళ్లు పడిపోయాయి. ఇప్పుడిప్పుడే అక్కడ బాక్సాఫీస్ పుంజుకుంటోంది.
ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సినిమానే మళ్లీ ప్రిమియర్స్‌తో మిలియన్ డాలర్ల మార్కును అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్ర విడుదల విషయంలో విపరీతమైన సందిగ్ధత నడిచింది. నాలుగు రోజుల కిందటే దీని రిలీజ్ ఖరారైంది. ఇలా డేట్ ఇచ్చారో లేదో అలా యుఎస్ ప్రిమియర్స్‌కు బుకింగ్స్ మొదలుపెట్టేశారు.
ప్రిమియర్స్‌కు ఐదు రోజుల ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తో 2 లక్షల డాలర్ల మార్కును దాటేయడం విశేషం. ఈ ఊపు చూస్తుంటే ప్రిమియర్స్ పూర్తయ్యేసరికి వసూళ్లు మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం కష్టమేమీ కాదనిపిస్తోంది. ట్రైలర్ రిలీజయ్యాక హైప్ మరింత పెరుగుతుంది కాబట్టి ఈ రికార్డు అందుకోవడం సాధ్యమే అనిపిస్తోంది. అలా కాని పక్షంలో 8-9 లక్షల డాలర్ల మధ్య సెటిలయ్యే ఛాన్సులున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వీకెండ్లో 2 మిలియన్ మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
This post was last modified on February 20, 2022 8:03 pm
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…