ఫిబ్రవరి చివరి వారం కొత్త సినిమాల రిలీజ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసినట్లే. ఈ వీకెండ్లో రాబోయేది ఒక్క ‘భీమ్లా నాయక్’ సినిమా మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఎదురెళ్లే సాహసం మరే చిత్రం చేసే అవకాశం లేదని సమాచారం. ఆ వారాంతానికి షెడ్యూల్ అయిన తెలుగు సినిమాలన్నీ వాయిదా పడినట్లే. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సింది. ఈ మేరకు అంతర్గతంగా ఒక అండర్ స్టాండింగ్ వచ్చేసినట్లు తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం సినిమా ‘సెబాస్టియన్’ ఆల్రెడీ వాయిదా పడిపోగా.. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘గని’ చిత్రాల సంగతే ఎటూ తేలకుండా ఉంది మొన్నటి వరకు. ‘భీమ్లా నాయక్’ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వీటి విషయంలో అయోమయం మొదలైంది. పవన్ సినిమా వస్తే వరుణ్ తేజ్ మూవీ అదే వీకెండ్లో రావడం అసాధ్యం. కాబట్టి ‘గని’ వాయిదా పక్కా అని తేలిపోయింది.
ఐతే ‘భీమ్లా నాయక్’ అనౌన్స్‌మెంట్ వచ్చాక కూడా శర్వా చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ను అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం నొక్కి వక్కాణించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన కూడా వచ్చింది. కానీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న శర్వాకు ‘ఆడవాళ్ళు..’ సక్సెస్ చాలా అవసరం. ఇలాంటి స్థితిలో ‘భీమ్లా నాయక్’కు పోటీగా దీన్ని దించడం పెద్ద రిస్క్ అని అర్థం చేసుకుని సినిమాను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.
‘భీమ్లా నాయక్’ పక్కాగా 25నే వస్తుందా అనే విషయంలో కొంత సందిగ్ధత నడిచినప్పటికీ.. ఇప్పుడు అది తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో జోరుగా టికెట్ల అమ్మకాలు జరిగిపోతున్నాయి. మరోవైపు శుక్రవారమే సెన్సార్ కూడా చేయించేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ కూడా రెడీ అవుతున్నట్లు నిర్మాణ సంస్థ ట్విట్టర్లో ప్రకటన చేసింది. కాబట్టి 25న ‘భీమ్లా నాయక్’ రావడం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు, గని చిత్రాలు వాయిదా పడటం లాంఛనమే. ఆ రెండు చిత్రాలను వారం ఆలస్యంగా మార్చి 4న రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on February 18, 2022 4:08 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…