పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ట్రీన్ ప్లే అందించారు. మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్ల నాయక్‌గా, రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ డేనియర్ శేఖర్‌గా కనిపించబోతున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నిన్ననే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే.. మొదట ఈ మూవీ రన్ టైమ్‌ను రెండు గంటల ఇరవై నిమిషాలకు మాత్రమే లాక్ చేశారు. ఓ స్టార్ హీరో సినిమాకు అంత తక్కువ నిడివి అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ విషయంపై తెగ ఫీల్ అయిపోయారు.
పవన్ సినిమాకు అంత తక్కువ రన్ టైమ్ ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం కూడా వ్యక్తం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. `భీమ్లా నాయక్` సినిమా నిడివి మరో 12 నిమిషాలు పెంచారట. మూడు గంటలు దాటడంతో గతంలో కొన్ని సీన్లను, ఓ పాటను తొలగించారట. కానీ ఫైనల్ కాఫీలో నిడివి బాగా తగ్గిపోవడంతో ఎడిటింగ్‌లో తొలగించిన కొన్ని సీన్లను మరియు ఆ సాంగ్‌ను తిరిగి యాడ్ చేశారనే టాక్ తాజాగా బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.
దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫుల్‌గా చిల్ అయిపోయారని తెలుస్తోంది. కాగా, భారీ అంచనాలు ఉన్న ఈ మూవీలో పవన్‌కు జోడీగా నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్‌లు అలరించనున్నారు. అలాగే ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
This post was last modified on February 18, 2022 12:41 pm
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…