సినీనటుడు రాంచరణ్ తేజ్ కు చెందిన విమానయాన కంపెనీ సమస్యల్లో ఉందా? ఆయన చైర్మన్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఎయిర్‌లైన్ కంపెనీ ట్రూజెట్ తన సర్వీస్‌లను ఆపేసిన నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. కంపెనీ సీఈఓ, సీఎఫ్‌ఓ, సీసీఓలు కూడా రాజీనామా చేసేయడంతో కంపెనీలో ఏం జరుగుతోంది అనే టాక్ తెరమీదకు వచ్చింది. రామ్‌చరణ్‌కు ఈ కంపెనీలో వాటాలుండగా, ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్‌గా ఆయన పనిచేస్తున్నారు.
ట్రూజెట్ 2015, జులైలో తన సర్వీస్‌లను స్టార్ట్ చేసింది. ట్రూజెట్ ఏడు విమానాలను ఆపరేట్ చేస్తోంది. ట్రూజెట్‌లో మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 90 శాతం వాటా ఉంది. ఈ కంపెనీలో వాటాలున్న రామ్‌చరణ్‌కు ప్రస్తుతం ట్రూజెట్ చైర్మన్‌గా ఆయన పనిచేస్తున్నారు. ప్రభుత్వం తెచ్చిన ఉడాన్ స్కీమ్‌తో కంపెనీ పుంజుకుంటుందన్న సమయంలో కరోనా వచ్చి పడింది.
మరోవైపు, ఎయిర్‌లైన్ ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేకపోవడంతో కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. డిమాండ్ తగ్గింది. అద్దెలు రాకపోవడంతో ఏడింటిలో ఐదు విమానాలను వీటిని అద్దెకు ఇచ్చిన వారు వాపసు తీసుకున్నారు. గత నెల రోజుల నుంచి ట్రూజెట్ టాప్ మేనేజ్‌మెంట్ కంపెనీని విడిచిపెడుతుండగా, గత మూడు నెలల నుంచి ఉద్యోగులకు శాలరీలను ఇవ్వడంలో ట్రూజెట్ ఇబ్బంది పడుతోందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు నెట్టుకుంటూ వచ్చినా ఈ రీజినల్ ఎయిర్‌లైన్ కంపెనీ పరిస్థితి, కరోనాతో మరింత అధ్వానంగా తయారయ్యింది. తన సర్వీస్‌లను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో కంపెనీ ప్రకటించలేదు. ఇప్పటికే ఎయిర్ కోస్టా, ఎయిర్ పెగాసెస్, పారమౌంట్, ఎయిర్ కార్నివాల్ వంటి రీజినల్ ఎయిర్‌లైన్ కంపెనీలు వచ్చినప్పటికీ నిలబడలేదు. తాజాగా ట్రూజెట్ కూడా అదే బాట పట్టింది.
This post was last modified on February 17, 2022 3:15 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…