Movie News

ఆ సినిమా ఆంధ్రాలో.. ఈ సినిమా తెలంగాణలో

సంస్కృతుల సంగతి ఎలా ఉన్నప్పటికీ సినిమాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభిరుచి ఒకేలా ఉండేది ఒకప్పుడు. ఒక సినిమా ఆడితే అన్నిచోట్లా బాగా ఆడేది. పోతే అన్ని చోట్లా పోయేది. ఒక ప్రాంతంలో బాగా ఆడి.. ఇంకో చోట తేడా కొట్టడం ఎప్పుడో కానీ జరిగేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు కొంత మారాయి. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. ఇంతకుముందులా గోదావరి భాష,యాసలో సినిమాలు తగ్గిపోయింది.

అదే సమయంలో హైదరాబాద్ అర్బన్ స్లాంగ్‌లో సినిమాల సంఖ్య బాగా పెరిగింది. ఇలాంటి సినిమాలు ఇక్కడ చాలా బాగా ఆడుతున్నాయి. ఆంధ్రాలో వాటికి ఆదరణ అనుకున్నంత స్థాయిలో లేదు. పక్కా ఆంధ్రా స్లాంగ్‌లో సినిమాలు తీస్తే అవి ఏపీలో బాగా ఆడి.. తెలంగాణలో ఆదరణ తగ్గుతుండటమూ జరుగుతోంది. కొత్త ఏడాదిలో రెండు రకాల ఉదాహరణలూ చూడొచ్చు.

సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ సినిమా పూర్తిగా గోదావరి జిల్లాల కల్చర్లో నడుస్తుంది. ఆ సినిమాకు ఆంధ్రాలో అంచనాలను మించి వసూళ్లు వచ్చాయి. ఏపీలో టికెట్ల రేట్లు తక్కువున్నా సరే.. ఆ చిత్రం లాభాలు తెచ్చుకుంది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమా ఏపీలో హౌస్ ఫుల్ వసూళ్లతో నడిచింది. రెండో వారం కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్‌గా ఆ సినిమా హిట్ స్టేటస్ అందుకుంది. ఐతే తెలంగాణలో ఈ చిత్రానికి చేదు అనుభవం ఎదురైంది. ఆరంభం నుంచి వసూళ్ల ఆశించిన స్థాయిలో లేవు.

ఇక్కడ దాన్ని ఫెయిల్యూర్‌గానే చెప్పాలి. ఐతే తాజాగా రిలీజైన ‘డీజే టిల్లు’ విషయానికి వస్తే దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రానికి తెలంగాణలో వసూళ్లు అసాధారణంగా ఉన్నాయి. సినిమా ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వీకెండ్ అంతా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది. వీక్ డేస్‌లోనూ స్ట్రాంగ్‌గానే నిలుస్తోంది. ఆంధ్రాలో మాత్రం ఈ చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు లేవు. అక్కడ సినిమా ఫెయిల్యూర్ అనలేం. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నాయి. కానీ పక్కా తెలంగాణ యాస, కల్చర్లో సాగే సినిమాకు తెలంగాణలో ఉన్నంత రెస్పాన్స్ అయితే ఆంధ్రాలో కనిపించడం లేదు. అక్కడ ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది ‘డీజే టిల్లు’.

This post was last modified on February 15, 2022 7:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

7 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

11 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

11 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

12 hours ago

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

12 hours ago