పూజాహెగ్డే ప్రమోషన్స్ కి రాదా..?

ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ ఫైనల్ గా మార్చి 11న విడుదల కావడానికి సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అనుకున్నప్పుడు పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారంతే. బహుశా సినిమా వాయిదా పడుతుందని చిత్రబృందం ముందే ఊహించి ఉంటుంది. అయితే మార్చి 11న మాత్రం సినిమా రిలీజ్ కావడం పక్కా.

దానికి తగ్గట్లే ఈ నెల చివరి వారం నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు.  దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ అయిపోయింది. రిలీజ్ కి ముందు రెండు వారాల పాటు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను ప్రమోట్ చేయనున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ కి హీరోయిన్ పూజాహెగ్డే రాదని టాక్. మార్చి నెల మొత్తం పూజా డైరీ ఫుల్ అయిపోయిందట.

ఓ పక్క తమిళంతో పాటు హిందీ సినిమాలకు పూజాహెగ్డే డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు షూటింగ్స్ ను పక్కన పెట్టి ‘రాధేశ్యామ్’ ప్రమోషన్స్ లో పాల్గొనలేనని చెబుతోందట పూజాహెగ్డే. ఆయా చిత్రనిర్మాతలు ఎవరైనా పర్మిషన్ ఇస్తే.. ఒకట్రెండు రోజులు మాత్రం ‘రాధేశ్యామ్’ టీమ్ కి సమయం కేటాయించగలదు. నార్త్ లో ప్రభాస్, పూజాలతో పాటు చిత్రబృందం మొత్తాన్ని తీసుకెళ్లి ఓ ఈవెంట్ చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. మరి దానికి పూజాహెగ్డే రాకపోతే కలరింగ్ ఉండదు. 

తెలుగు ఈవెంట్స్ కి పూజా రాకపోయినా.. బాలీవుడ్ లోనైనా ఆమె సినిమాను ప్రమోట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి పూజాహెగ్డే ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. ఇక ‘రాధేశ్యామ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తమన్ బీజీఎమ్ అందించారు.