హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 90వ దశకం వరకు ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు.. 2000 తర్వాత జోరు కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాపులు ఆయన్ని వెనక్కి లాగాయి. మార్కెట్ దెబ్బ తినేసి సినిమాలు తగ్గించేశారు. సొంత బేనర్లోనూ సినిమాలు చేయడం తగ్గిపోయింది. బయట కూడా సినిమాలు పెద్దగా ఒప్పుకోలేదు. కానీ పూర్తిగా అయితే సినిమాలకు టాటా చెప్పలేదు.
అప్పుడప్పుడూ ఒక సినిమాతో పలకరిస్తున్నారు. కానీ సరైన ఫలితం మాత్రం దక్కట్లేదు. చివరగా సొంత బేనర్లో లీడ్ రోల్‌లో గాయత్రి అనే సినిమా చేశారు. అది దారుణమైన ఫలితమందుకుంది. తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా చాలా కాలం పాటు వార్తల్లో లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి విడుదలకు సిద్ధం చేశారు. దీనికి ఆశించినంత హైప్ అయితే కనిపించడం లేదు.
సన్ ఆఫ్ ఇండియా హిట్టయితే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. స్వయంగా మోహన్ బాబుకు కూడా ఈ సినిమా మీద నమ్మకం లేదా అనిపిస్తోంది ఆయన మాటలు చూస్తుంటే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన ఆయన.. రిజల్ట్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది చెడ్డ సినిమా కాదు.
ఈ చిత్రం సక్సెస్ అవుతుందా లేదా అనేది చెప్పలేకపోవచ్చు. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి చిత్రమని ఫీలవుతారు. గత సినిమాల అనుభవాల కారణంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఘంటాపథంగా చెప్పను. కానీ మోహన్ బాబు మంచి సినిమా చేశారు అని అందరూ అనుకుంటారు. సక్సెస్ అయితే మంచి సక్సెస్ అవుతుంది. లేదంటే లేదు. దానికీ సిద్ధమయ్యా అని మోహన్ బాబు పేర్కొనడం గమనార్హం. ఆయన మాటల్ని బట్టి చూస్తే సన్ ఆఫ్ ఇండియాకు మంచి సినిమా అని పేరొచ్చినా బాక్సాఫీస్ సక్సెస్ కాదేమో అన్న అనుమానంతో ఉన్నట్లే ఉన్నారు.
This post was last modified on February 14, 2022 1:52 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…