పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నారు. 2021 క్రిస్మస్ టైం నుంచి ఆయన సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ సినిమా సంక్రాంతి రేసులో ఉన్నంత వరకు పవన్ షూటింగ్‌లో తీరిక లేకుండా ఉన్నాడు. డిసెంబరు మధ్యలో ఈ సినిమా పని శరవేగంగా సాగింది. కానీ ఆ చిత్రాన్ని సంక్రాంతి రేసు నుంచి తప్పించగానే టీం అంతా రిలాక్స్ అయిపోయింది. పవన్ తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ సెలవుల్లో రష్యాకు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వచ్చినా కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో షూటింగ్‌లకు దూరంగానే ఉన్నాడు.
రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాడు. ‘భీమ్లా నాయక్’ శివరాత్రికి కూడా వచ్చే సూచనలు కనిపించకపోవడంతో పవన్ తొందరపడాల్సిన పని లేకపోయింది. ఐతే కొన్ని రోజుల కిందట పవన్ మళ్లీ సినిమాల పనుల్లో పడ్డాడు.ఇటీవలే పవన్ తాను నటిస్తున్న మరో సినిమా ‘హరి హర వీరమల్లు’కి సంబంధించి స్క్రిప్టు, కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన చర్చల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది.
ఈ లోపు ‘భీమ్లా నాయక్’కు సంబంధించి మిగిలిన కొంత పనిని కూడా పవన్ పూర్తి చేయాలని డిసైడయ్యాడు. ఈ సినిమా రిలీజ్ సంగతి సందిగ్ధంలో ఉన్నప్పటికీ తన పని తాను పూర్తి చేసి ‘వీరమల్లు’లోకి వెళ్లిపోవాలని పవన్ డిసైడయ్యాడు. ఐతే ‘వీరమల్లు’ పాత్ర కోసం మధ్యలో దొరికిన ఖాళీలో పవన్ జుట్టు పెంచాడు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో పవన్ జులపాల జుట్టుతో కనిపించనున్నాడు. సొంతంగా పెంచిన జుట్టుకు కొంతమేర హెయిర్ ఎటాచ్మెంట్స్ వాడుతున్నారు.
ఐతే వీరమల్లు కోసం జుట్టు పెంచి లుక్ మార్చుకున్నప్పటికీ.. ఆ లుక్‌తోనే పవన్ ‘భీమ్లా నాయక్’ సెట్లోకి అడుగు పెట్టాడు. పొడవాటి జుట్టుతోనే ఈ సినిమా పాట చిత్రీకరణలో పాల్గొన్నాడు. తాజాగా ఆ పాటకు సంబంధించి అప్‌డేట్‌లో భాగంగా ఒక ఫొటో రిలీజ్ చేయగా.. పవన్ ఈ సినిమాలో సింక్ కాని లుక్‌తో కనిపించాడు. పాటే కాబట్టి జనాలు సర్దుకుపోతారని అనుకుని ఉండొచ్చు. రెండు మూడు రోజుల్లో ‘భీమ్లా నాయక్’కు పవన్ గుమ్మడికాయ కొట్టేసి ‘వీరమల్లు’ పని మొదలుపెడతాడని సమాచారం.
This post was last modified on February 13, 2022 5:08 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…