టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డీప్‌గా హర్టయ్యాడు. తాను ఎంతో కష్టపడి, ఇష్టపడి కంపోజ్ చేసిన పాట.. అధికారికంగా రిలీజ్ కావడానికి కావడానికి ముందే ఆన్ లైన్లో లీక్ అయిపోవడమే అందుక్కారణం. ఆ పాట మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలోనిది కావడం గమనార్హం. ఈ సినిమా నుంచి కళావతి అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను ప్రేమికుల దినోత్సవ కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీని ప్రోమో కూడా వచ్చింది. అందులో విజువల్స్ చాలా ఆకర్షణీయంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. భారీ అంచనాలున్న సినిమా నుంచి వస్తున్న తొలి పాట కావడంతో కళావతిపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఐతే చిత్ర బృందం ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను రూపొందించడానికి ఒక వ్యక్తికి పని అప్పగిస్తే.. అతనే ఈ పాటను ఆన్ లైన్లో లీక్ చేసేయడంతో షాకవడం టీం వంతయింది.
ఈ విషయంలో మిగతా అందరి కంటే తమన్ ఎక్కువ హర్టయినట్లున్నాడు. అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో మెసేజ్‌లు రిలీజ్ చేశాడు. ట్విట్టర్లో వాటిని పోస్ట్ చేశాడు. ఒక పాట కోసం సంగీత దర్శకులుగా తాము ఎంత కష్టపడతామో.. దాని కోసం చిత్ర బృందంలో మిగతా వాళ్లు ఎంత శ్రమిస్తారో.. ఎంతెంత డబ్బు ఖర్చవుతుందో తమన్ వివరిస్తూ తన బాధను పంచుకున్నాడు.
ఇంత కష్టపడి అభిమానుల కోసం పాటను సిద్ధం చేసి వారితో ఎప్పుడెప్పుడు పంచుకుందామా అని తాము చూస్తుంటే.. తాము పని అప్పగించిన వ్యక్తే ఇలా పాటను లీక్ చేసేయడం ఎంత దారుణం అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తట్టుకోలేని బాధను కలిగిస్తోందని చెప్పాడు. ఐతే ఇకపై తాము మరింత జాగ్రత్తగా ఉంటామని.. అభిమానుల కోసం మరింత కష్టపడి పని చేస్తామని తమన్ తెలిపాడు. ఆన్ లైన్లోకి వచ్చిన కళావతి లిరికల్ వీడియోను చిత్ర బృందం తొలగించే పనిలో పడింది.
This post was last modified on February 13, 2022 12:39 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…