కొన్ని వారాలుగా ఇటు థియేటర్లలో.. అటు ఓటీటీల్లో సరైన సినిమాలు లేక డీలా పడ్డ ప్రేక్షకులకు ఈ వారం పండుగ అన్నట్లే ఉంది. వివిధ భాషల్లో అరడజనుకు పైగా కొత్త సినిమాలు ఈ వీకెండ్లో ప్రేక్షకులను పలకరించాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల సందడి అయితే కాస్త ఎక్కువగానే ఉంది. థియేటర్లలోకి ఈ వారం నాలుగు కొత్త సినిమాలు దిగగా.. ఓటీటీల ద్వారా మూడు చిత్రాలు రిలీజయ్యాయి.
గురు, శుక్రవారాల్లో మాత్రమే ఆరు సినిమాలు రిలీజవడం విశేషం. ఐతే వీటిలో తెలుగు ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరిచిన సినిమా మాత్రం ఏదీ లేదు. ఈ వీకెండ్లో ఎక్కువ అంచనాలున్నది ‘ఖిలాడి’ మీదే. మాస్ రాజా రవితేజ ‘క్రాక్’ తర్వాత వచ్చిన సినిమా ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలకు దూరంలో ఆగిపోయింది. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి రోజు ఓపెనింగ్స్‌కు ఢోకా లేకపోయినా.. సినిమా నిలబడే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
తొలి రోజు సెకండ్ షోలకే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.ఇక శుక్రవారం థియేటర్లలోకి దిగిన ఎఫ్ఐఆర్, సెహరి సినిమాలకు ఆశించిన స్పందన లేదు. ‘ఎఫ్ఐఆర్’ మంచి సినిమానే అయినా.. తెలుగు ప్రేక్షకులకు అది అంతగా పట్టట్లేదు. మరీ సీరియస్ సినిమా కావడం, విష్ణు విశాల్ సహా నటీనటులెవరు తెలిసిన వారు కాకపోవడం దీనిక ిమైనస్. ఇక ‘సెహరి’ సినిమాకు అంతగా బజ్ లేదు. సినిమా చాలా చిన్న స్థాయిలో రిలీజైంది. టాక్ యావరేజ్ అంటున్నారు. ఇక ఓటీటీల ద్వారా విడుదలైన మహాన్, భామాకలాపం అంచనాలను అందుకోలేకపోయాయి. వీటికి మిశ్రమ స్పందన వస్తోంది. సుమంత్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’కి పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది.
ఇలా అరడజను సినిమాల్లో ఏదీ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఇక ఈ వారానికి మిగిలింది ‘డీజే టిల్లు’నే. ఈ సినిమా ట్రైలర్ రిలీజయ్యాక అనూహ్యమైన హైప్ వచ్చింది. రిలీజ్ టైంకి అది ఇంకా పెరిగింది. ఈ వారం మిగతా సినిమాలు నిరాశ పరచడంతో ‘డీజే టిల్లు’కు హైప్ ఇంకా పెరిగిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశ్చర్యకర రీతిలో జరిగాయి. సినిమా తొలి రోజు హౌస్ ఫుల్స్‌తో నడవబోతోంది. మంచి టాక్ వస్తే టిల్లు గాడు వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on February 12, 2022 10:36 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…