ఒకప్పుడు సౌత్‌లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిన రేవతి.. మొన్నమొన్నటి వరకు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన కాజోల్ ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కోసం చేతులు కలిపారు. సూరజ్ సింగ్, శ్రద్ధ అగర్వాల్, వర్ష కుక్రేజీ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ను ఇవాళ ప్రారంభించారు.
ఈ చిత్రాన్ని కొన్ని నెలల క్రితం ‘ద లాస్ట్ హుర్రే’ పేరుతో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ‘సలామ్ వెంకీ’గా మార్చారు. ఇదొక తల్లి కథ. ఆమె జీవితంలో అనుకోకుండా చాలా సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొని చివరికి విజయం ఎలా సాధించిందనేది థీమ్. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నారు రేవతి.
పెళ్లి తర్వాత హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే తల్లీబిడ్డల చుట్టూ తిరిగే హెలికాప్టర్ ఈలా, త్రిభంగా చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి అలాంటి కాన్సెప్ట్‌నే ఎంచుకుంది. కాకపోతే రేవతి డైరెక్ట్ చేస్తూ ఉండటంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
మిత్ర్ మై ఫ్రెండ్, ఫిర్ మిలేంగే చిత్రాలతో అద్భుతమైన డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నారు రేవతి. ‘మిత్ర్’ చిత్రానికైతే నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాజోల్ కూడా మంచి నటి కాబట్టి వీరి కాంబినేషన్‌లో ఎక్సెలెంట్ సినిమా వస్తుందని అంచనా వేస్తున్నారంతా.
This post was last modified on February 11, 2022 11:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…