అనసూయ భరధ్వాజ్.. ఈమె తెలియని వారుండరు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓవైపు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా సత్తా చాటుతూనే.. మరోవైపు వెండితెరపై వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తూ నటిగా తన స్థాయిని పెంచుకుంటోంది. తాజాగా అనసూయ నటించిన చిత్రం `ఖిలాడి`.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరో అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించారు. అలాగే అనసూయ డింపుల్ హయాతికి తల్లిగా `చంద్రకళ` అనే పాత్రను పోషించింది.
ఈమె రోల్ సైతం సినిమాకు బాగానే హైలైట్ కానుంది. ఇకపోతే నిన్న హైదరాబాద్ బంజారహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌లో అనసూయ రవితేజతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనసూయ మాట్లాడుతూ.. `ఖిలాడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో చంద్రకళ క్యారెక్టర్ పోషించడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా.
రవితేజ గారితో కలిసి పని చేయడం అదిరిపోయింది. నేను బాగా ఎంజాయ్ చేస్తూ నటించా. ఆయన ఓ బెస్ట్ కో- స్టార్. ఆయన్ను చూస్తే నాకు ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం ఇన్నిరోజులు రవితేజ గారితో ట్రావెల్ చేశాను కానీ ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయా. కానీ ఎప్పటికైనా తెలుసుకుంటా.` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
This post was last modified on February 10, 2022 4:55 pm
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…