పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘భీమ్లానాయక్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ‘హరిహర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు. దీని తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డితో మరో సినిమా ఒప్పుకున్నారు. వీటితో పాటు తమిళ రీమేక్ లో కూడా నటించబోతున్నారని సమాచారం.
ఇలాంటి సమయంలో ఆయన మరో సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ.. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నారట. ఇటీవల ‘ఖిలాడి’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఆలోచనను బయటపెట్టారు. ఈ విషయాన్ని పవన్ తో చర్చించగా.. ఆయన సముఖంగా స్పందించినట్లు చెప్పారు.
మంచి కథ దొరికితే కచ్చితంగా పవన్ కలిసి వినిపిస్తానని చెప్పుకొచ్చారు.
కోనేరు బ్యానర్ లో దర్శకుడు రమేష్ వర్మ ఎక్కువ సినిమాలు చేశారు. రీసెంట్ గా రమేష్ వర్మకు ఓ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు కోనేరు సత్యనారాయణ. ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలోనే పవన్ తో సినిమా అనుకుంటున్నారట. ‘ఖిలాడి’ సినిమా గనుక హిట్ అయితే పవన్ కళ్యాణ్ కథ వినిపించే ఛాన్స్ రమేష్ వర్మకు దక్కుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.
మరోపక్క మాత్రం ఇప్పట్లో పవన్ మరో సినిమా చేసే ఛాన్స్ లేదని టాక్. రాబోయే ఎన్నికల్లో ఆయన పూర్తి స్థాయిలో పాల్గొనాలనుకుంటున్నారు. అప్పటిలోగా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే పవన్ లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి. అవి పూర్తి చేయడానికే టైం సరిపోదు. ఒకవేళ కోనేరు నిర్మాణంలో సినిమా ఒప్పుకున్నా.. ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేని పరిస్థితి.
This post was last modified on February 9, 2022 9:01 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…