యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ గత కొంత కాలం నుంచి హిట్టు ముఖమే చూడలేదు. `శతమానంభవతి` తర్వాత ఈయన నటించిన రాధ, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం చిత్రాలు ప్రేక్షకులకు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అయితే శర్వా తాజాగా నటించిన చిత్రం `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.
ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని శర్వానంద్ తెగ తాపత్రాయపడుతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక, ఖుష్బూ, ఊర్వశి, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్రమోషన్స్ షురూ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయట.
సోషల్ మీడియాలో జోరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆడవాళ్ళు మీకు జోహార్లు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ని సోనీ గ్రూప్ సొంతం చేసుకున్నారట. సోనీ గ్రూప్ అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ సోనీ లివ్ తీసుకున్నట్లే. ఇక ఇందుకు గానూ వారు ఏకంగా రూ. 25 కోట్లను చెల్లించారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలే నిజమైతే ఇప్పటి వరకు శర్వానంద్ కెరీర్‌లో రికార్డు స్థాయిలో కుదిరిన డీల్ ఇదే అవుతుంది.
This post was last modified on February 9, 2022 2:14 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…