తనకు దర్శకుడిగా తొలి అవకాశం అందించిన అక్కినేని కుటుంబం రుణాన్ని బాగానే తీర్చుకున్నాడు కళ్యాణ్ కృష్ణ కురసాల. అతను దర్శకుడిగా పరిచయమైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాగ్ కెరీర్లోనే అది హైయెస్ట్ గ్రాసర్.
దీని తర్వాత అదే అన్నపూర్ణ సంస్థలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేసిన కళ్యాణ్.. నాగ్ తనయుడు నాగచైతన్యకు కూడా పెద్ద హిట్టే ఇచ్చాడు. ఐతే ఇంత మేలు చేసిన దర్శకుడితో నాగ్.. ఆ తర్వాత వ్యవహరిస్తున్న తీరే ఆశ్చర్యం కలిగిస్తోంది.
‘సోగ్గాడే..’కు హైలైట్‌గా నిలిచిన బంగార్రాజు పాత్రను తీసుకుని.. దాని బ్యాక్ స్టోరీతో ప్రీక్వెల్ తరహాలో ఓ సినిమా చేయాలని నాగ్ మూడేళ్ల కిందటే ఫిక్సయ్యాడు. అప్పట్నుంచి కళ్యాణ్ ఆ స్క్రిప్టు మీద పని చేస్తున్నాడు. కానీ ఎంతకీ తెగట్లేదు. సినిమా మొదలు కావట్లేదు.
కళ్యాణ్ చివరి సినిమా ‘నేల టిక్కెట్టు’ రిలీజై రెండేళ్లు దాటిపోయింది. అంతకుముందే ‘బంగార్రాజు’ మీద కొంత వర్క్ చేసిన కళ్యాణ్.. ఆ తర్వాత సీనియర్ రైటర్ సత్యానంద్‌తో కలిసి అలుపు సొలుపు లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. కానీ నాగ్ ఎంతకీ ఆ సినిమా సంగతి తేల్చట్లేదు. స్క్రిప్టు ఓకే అయిందని.. ఇక సినిమా మొదలవడమే తరువాయి అని వార్తలు రావడం.. కానీ సినిమా మొదలు కాకపోవడం ఇదీ వరస. లాక్ డౌన్ కంటే ముందు కూడా వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా ‘బంగార్రాజు’ను మొదలుపెట్టబోతున్నారని గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు కథ మారిపోయింది.
మళ్లీ షూటింగ్స్ మొదలవ్వగానే ‘వైల్డ్ డాగ్’ను పూర్తి చేసి.. ఆ వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయడానికి నాగ్ రంగం సిద్ధం చేసుకున్నట్లు వెల్లడైంది. మరి ‘బంగార్రాజు’ సంగతేమైందన్నది తెలియడం లేదు. ఓవైపు ‘ఆఫీసర్’, ‘మన్మథుడు-2’ లాంటి పేలవమైన సినిమాల్ని ఓకే చేసిన నాగ్.. ‘బంగార్రాజు’ విషషయంలో మాత్రం ఇంతగా నాన్చడం, కళ్యాణ్‌తో ఆటలాడుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on June 15, 2020 1:54 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…