డింపుల్ హయతి.. ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన అమ్మాయి. పేరు చూస్తే ఉత్తరాది భామ అనిపిస్తుంది కానీ.. నిజానికి తను తెలుగమ్మాయే. తెలుగు పేరు పెట్టుకుని, తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే పట్టించుకోరని పేరు మార్చుకుందా.. లేక ముందు నుంచి ఇదే పేరా అన్నది తెలియదు కానీ.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఈ అమ్మాయికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్‌తో మెరిశా కొంత కాలం కనిపించకుండా పోయిన ఈ డస్కీ బ్యూటీ.. ఈ మధ్య బాగానే ఛాన్సులందుకుంటోంది. గత వారాంతంలో వచ్చిన సామాన్యుడు సినిమాలో కథానాయికగా మెరిసన డింపుల్‌కు ఖిలాడి తన కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడానికి డింపుల్ బాగానే కష్టపడ్డట్లుంది. ఇలాంటి మాస్ మసాలా సినిమాల్లో హీరోయిన్లకు నటన పరంగా అంతగా ప్రాధాన్యం ఉండదు.
గ్లామర్‌తోనే ఆకట్టుకోవాలి. అందుకేనేమో డింపుల్ ఏ హద్దులూ పెట్టుకోకుండా ఎక్స్‌పోజింగ్ కొంచెం గట్టిగానే చేసిన సంగతి ప్రోమోల్లో బాగానే తెలుస్తోంది. అది చాలదన్నట్లు ప్రమోషన్లలో కూడా హాట్ లుక్స్‌తో చంపేస్తోందామె. తాజాగా ఆమె సినిమాలో మరో కథానాయికగా నటించిన మీనాక్షి చౌదరితో కలిసి మీడియా వాళ్లను కలిసింది.
మామూలుగా ఇలాంటి కార్యక్రమాలకు మామూలు డ్రెస్‌లోనే వస్తారు. కానీ డింపుల్ మాత్రం క్లీవేజ్ షోతో మత్తెక్కించే డ్రెస్ వేసుకొచ్చింది. దీంతో కెమెరాల ఫోకస్ అంతా ఆమె మీదే ఉంది. మీడియా మీట్ అవ్వగానే సోషల్ మీడియాలో తన ఫొటోలు వైరల్ అయిపోయాయి. విలేకరుల సమావేశంలో ఇంత హాటా అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా చేసిన డింపుల్.. మీడియా వాళ్లనే కాక నెటిజన్ల దృష్టిని కూడా బాగానే ఆకర్షించింది. మరి సినిమాలో ఇంకెంతగా తన అందాలతో కుర్రకారును ఆకర్షిస్తుందో చూడాలి.
This post was last modified on February 9, 2022 9:30 am
దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…