ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కరోనా మూడో వేవ్ లేకుంటే జనవరి 7నే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. అలా రిలీజైతే ఇప్పటికి ఆ సినిమాలో హైలైట్ల గురించి తెగ చర్చ జరుగుతుండేది. కానీ దురదృష్టవశాత్తూ సినిమా వాయిదా పడింది. అయినా ఈ సినిమాపై అంచనాలేమీ తగ్గిపోలేదు.
ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ అలాగే ఉంది. ఇలాంటి టైంలో డిసెంబర్లో ముంబయి వేదికగా జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఈవెంట్ తాలూకు వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లోకి వచ్చింది. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ.. సినిమాలో ఒక సీక్వెన్స్ గురించి చెప్పిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇప్పటిదాకా ఏ ప్రోమోలో ఆ సన్నివేశం గురించి హింట్ ఇవ్వలేదని.. దానికి సంబంధించి ఎవరికీ ఏమీ చూపించలేదని.. అలాగే ఎక్కడా దాని గురించి మాట్లాడలేదని.. ఎవ్వరికీ దాని గురించి ఐడియా లేదని.. రేప్పొద్దున థియేటర్లలో ఆ సన్నివేశం చూసినపుడు ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదని జక్కన్న చెప్పాడు.
సినిమాలో ద్వితీయార్ధంలో ఈ సన్నివేశం వస్తుందని.. ఈ సీన్ చూస్తున్నపుడు ఒంట్లోని ప్రతి కండరం బిగుసుకుంటుందని.. ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోతారని.. కానీ అదే సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటుందని.. ఆ సీన్లో తారక్, చరణ్ అంత అద్భుతంగా చేశారని.. ఇంతకుమించి ఆ సన్నివేశం గురించి తాను ఎక్కువ చెప్పనని.. రేప్పొద్దున థియేటర్లలో చూసినపుడు ఆ సన్నివేశాన్ని అనుభూతి చెందే తీరే వేరుగా ఉంటుందని చెప్పాడు జక్కన్న. తన సినిమాలు వేటిలోనూ ఏ సన్నివేశం గురించీ జక్కన్న విడుదలకు ముందు ఈ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చింది లేదు. మరి ఈ రేంజిలో చెప్పాడంటే ఆ సీన్ ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి.
This post was last modified on February 8, 2022 12:16 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…