తెలుగులో మళ్లీ పేరున్న సినిమాల సందడి మొదలవుతోంది. ఈ వారాంతానికి ‘ఖిలాడి’ లాంటి పెద్ద సినిమా షెడ్యూల్ అయింది. దాంతో పాటు డీజే టిల్లు, సెహరి లాంటి చిన్న సినిమాలు కూడా రేసులోకి దిగుతున్నాయి. తర్వాతి వారం సంగతేంటో క్లారిటీ లేదు. ఐతే ఈ నెలలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది శివరాత్రి వీకెండే. ఫిబ్రవరి 25న ముందు అనుకున్న ప్రకారం అయితే ‘భీమ్లా నాయక్’ రావాలి. కానీ ఆ రోజున ఆ చిత్రాన్ని దించే సూచనలు కనిపించడం లేదు.
కుదిరితే ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తొలి డేట్‌కు సినిమాను దించడం అసాధ్యమనే అనిపిస్తోంది. ఆ దిశగా ఎలాంటి సంకేతాలు లేవు. దీంతో ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియిన్ అనుకున్నట్లే ఆ తేదీకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే తమిళ అనువాద చిత్రం ‘వలిమై’ కూడా అదే రోజు రిలీజ్ కాబోతోంది. వీటికి తోడు ఇంకో సినిమా కూడా శివరాత్రి వీకెండ్‌ను టార్గెట్ చేయబోతోంది.
అదే.. గని. డిసెంబర్లోనే రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరగా ప్రకటించిన ప్రకారం ఫిబ్రవరి 25న లేదా మార్చి 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ‘భీమ్లా నాయక్’ విడుదల విషయంలో స్పష్టతను బట్టి ఒక డేట్‌ను ఎంచుకోవాలన్నది చిత్ర బృందం ఆలోచన. ఐతే ఇప్పుడు ‘గని’ మేకర్స్.. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలతో మాట్లాడి ఒక స్పష్టత తెచ్చేసుకున్నట్లు సమాచారం.
‘భీమ్లా నాయక్’ను ఏ రకంగా చూసినా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే నిర్మాతలు ఉన్నారట. ఏప్రిల్ 1కి సినిమా వాయిదా పడటం లాంఛనమే. ఈ మేరకు క్లారిటీ వచ్చేయడంతో ‘గని’ని ఫిబ్రవరి 25నే దించేయాలని చూస్తున్నారట. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వస్తుందని సమాచారం. ‘గని’ ఖాయమైతే.. ‘సెబాస్టియన్’ శివరాత్రి రేసు నుంచి తప్పుకుంటుంది. గని, ఆడవాళ్లు మీకు జోహార్ల, వలిమై ఆ వీకెండ్లో పోటీ పడతాయి.
This post was last modified on February 7, 2022 6:53 pm
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…