పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. అవి పూర్తి కాకుండానే మరో సినిమా ఒప్పుకున్నారని సమాచారం. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నారట. దీనికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ కూడా పెట్టినట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేయాలనేది మారుతి ప్లాన్.
ప్రభాస్ కూడా చాలా తక్కువ రోజులు మాత్రమే కాల్షీట్స్ కేటాయిస్తున్నారట. దానికి తగ్గట్లే పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో రొమాన్స్ డోస్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. కథ ప్రకారం.. ప్రభాస్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారట. ముగ్గురూ కూడా క్రేజ్ ఉన్న హీరోయిన్లనే తీసుకోవాలనుకుంటున్నారు.
ప్రభాస్ తో సినిమా అంటే ఏ హీరోయిన్ కాదంటుంది..? కాబట్టి స్టార్ హీరోయిన్లు రంగంలోకి దిగడం ఖాయం. రొమాంటిక్ సీన్స్ లో నటించాలంటే ప్రభాస్ కి చాలా సిగ్గు. ‘రాధేశ్యామ్’లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ను డూప్స్ తో కానిచ్చేశారు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ అంటే ప్రభాస్ ఎలా నటిస్తారో చూడాలి.
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేయాలనుకుంటున్నారు. అందుకే ఒక లవ్ స్టోరీ, ఒక యాక్షన్ సినిమా, మైథలాజికల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ అంటూ రకరకాల కాన్సెప్ట్ లతో సినిమాలు చేయబోతున్నారు. ఇప్పుడేమో రొమాంటిక్ డ్రామాలో కనిపించబోతున్నారు. మరి తన పెర్ఫార్మన్స్ తో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి!
This post was last modified on February 7, 2022 4:33 pm
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…