దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఆమె మృత్యువుతో పోరాడుతున్నట్లు ముంబయి మీడియా వర్గాలంటున్నాయి. లతను వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడైంది. కరోనాకు తోడు న్యుమోనియా సోకడంతో గత నెలలో ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. నెల రోజులకు పైగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఉంచి లతకు చికిత్స అందిస్తున్నారు.
మధ్యలో ఆమె పరిస్థితి విషమంగా మారినట్లు వార్తలు రావడం.. ఆ తర్వాత ఆమె కోలుకోవడం.. ఇటీవల ఆమె పరిస్థితి మరింత మెరుగైనట్లు అధికారిక ప్రకటనలు కూడా రావడం తెలిసిందే. కానీ లతను ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె పరిస్థితి ఏంటో అర్థం కాక అభిమానులు అయోమయానికి గురయ్యారు.
ఆమెకు ప్రమాదం అయితే తప్పలేదని భావించారు. ఆ అనుమానాలకు తగ్గట్లే ఇప్పుడు లత పరిస్థితి మళ్లీ విషమంగా మారినట్లు కనిపిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ వైరస్ దుష్ప్రభావం, న్యుమోనియా కారణంగా లత పరిస్థితి ఇబ్బందిగా తయారైనట్లు కనిపిస్తోంది. ఏడాదిన్నర కిందట గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. వైరస్ దుష్ప్రభావాలతో అవయవాలు దెబ్బ తిని ఆయన పరిస్థితి విషమించింది.
మధ్యలో కోలుకున్నట్లే కనిపించినా.. తిరిగి పరిస్థితి ఇబ్బందికరంగా మారి చివరికి ఆయన తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ అందుకు భిన్నంగా విషమ స్థితిని అధిగమించి కోలుకుని మళ్లీ ఇంటికి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రధానంగా హిందీలో పాటలు పాడిన లత.. ఏకంగా 36 భాషల్లో వేల కొద్దీ పాటలు ఆలపించడం విశేషం. 92 ఏళ్ల లతా మంగేష్కర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
This post was last modified on February 5, 2022 7:42 pm
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…